Breaking News

నీరజ్‌ చోప్రాకు రెండో స్థానం

Published on Sat, 05/24/2025 - 02:15

చోర్జో (పోలాండ్‌): ఈ సీజన్‌లో తాను పాల్గొన్న రెండో ఈవెంట్‌లోనూ భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. శుక్రవారం జరిగిన జానుస్‌ కుసోన్‌స్కీ స్మారక అథ్లెటిక్స్‌ మీట్‌లో నీరజ్‌ చోప్రా చివరిదైన ఆరో ప్రయత్నంలో తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. 27 ఏళ్ల నీరజ్‌ చివరి ప్రయత్నంలో జావెలిన్‌ను 84.14 మీటర్ల దూరం విసిరి మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకాడు. ఈనెల 16న జరిగిన దోహా డైమండ్‌ లీగ్‌ మీట్‌లోనూ నీరజ్‌ రెండో స్థానాన్ని సాధించాడు. 

దోహా డైమండ్‌ లీగ్‌ మీట్‌లో అగ్రస్థానంలో నిలిచిన జూలియన్‌ వెబెర్‌ (జర్మనీ) అదే జోరును ఇక్కడా కొనసాగించాడు. జూలియన్‌ వెబెర్‌ జావెలిన్‌ను 86.12 దూరం విసిరి తొలి స్థానాన్ని పొందగా... రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా; 83.24 మీటర్లు) మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తొలి ప్రయత్నంలో ఫౌల్‌ చేసిన నీరజ్‌ రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 81.28 మీటర్ల దూరం విసిరాడు. 

ఆ తర్వాత మూడు, నాలుగు ప్రయత్నాల్లో ఫౌల్‌ చేసిన నీరజ్‌ ఐదో ప్రయత్నంలో జావెలిన్‌ను 81.80 మీటర్ల దూరం విసిరాడు. ఆ తర్వాత చివరి ప్రయత్నంలో తన ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకొని రెండో స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు.   

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)