Breaking News

‘వరల్డ్‌ అథ్లెట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ ఫైనల్లో నీరజ్‌ చోప్రా 

Published on Wed, 11/15/2023 - 03:17

మోంటెకార్లో: ఈ ఏడాది ప్రపంచ పురుషుల అత్యుత్తమ అథ్లెట్‌ పురస్కారం తుది జాబితాలో భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాకు స్థానం లభించింది. నెల రోజుల క్రితం ప్రపంచ అథ్లెటిక్స్‌ ఈ అవార్డు కోసం 11 మందిని నామినేట్‌ చేసింది. అక్టోబర్‌ 28తో ఓటింగ్‌ ముగిసింది. సామాజిక మాధ్యమాల్లో నిర్వహించిన ఓటింగ్‌లో 20 లక్షల మంది పాల్గొన్నారు. ఓటింగ్‌ అనంతరం ఈ జాబితాను 11 నుంచి కుదించి టాప్‌–5 ఆటగాళ్లను ఎంపిక చేశారు.

ఈ ఐదుగురిలో ఒకరికి డిసెంబర్‌ 11న ‘వరల్డ్‌ అథ్లెట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు లభిస్తుంది. ఈ ఏడాది నీరజ్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రపంచ చాంపియన్‌ షిప్‌లో తొలిసారి స్వర్ణ పతకం సాధించడంతోపాటు ఆసియా క్రీడల్లో తన పసిడి పతకాన్ని నిలబెట్టుకున్నాడు. నీరజ్‌తోపాటు రియాన్‌ క్రుసెర్‌ (అమెరికా; షాట్‌పుట్‌), డుప్లాంటిస్‌ (స్వీడన్‌; పోల్‌వాల్ట్‌), కిప్టుమ్‌ (కెన్యా; మారథాన్‌), నోవా లైల్స్‌ (అమెరికా; 100, 200 మీటర్లు) ‘వరల్డ్‌ అథ్లెట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారం రేసులో ఉన్నారు.   
 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)