Breaking News

నిరాశపరిచిన నీరజ్‌ చోప్రా.. స్వర్ణం గెలిచిన చోట కనీసం కాంస్యం కూడా లేకుండా..!

Published on Thu, 09/18/2025 - 19:15

టోక్యోలో జరుగుతున్న వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ 2025లో భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా దారుణంగా విఫలమయ్యాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన నీరజ్‌.. అంచనాలు తలకిందులు చేస్తూ ఎనిమిదో స్థానంతో (84.03 మీటర్లు) ముగించాడు. 

2021 ఒలింపిక్స్‌లో ఇదే ప్లేస్‌లో (టోక్యో) స్వర్ణం గెలిచిన నీరజ్‌.. ఈసారి కనీసం​ కాంస్యం కూడా సాధించలేక ఉసూరుమనిపించాడు. 26 పోటీల తర్వాత నీరజ్‌ పతక రహితుడిగా మిగలడం ఇదే మొదటిసారి. ఈ పోటీలకు ముందు పాల్గొన్న డైమండ్‌ లీగ్‌లో నీరజ్‌ రెండో స్థానంలో (85.01) నిలిచాడు. 

ఈ పోటీల్లో ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు చెందిన కెషోర్న్‌ వాల్కాట్‌కు స్వర్ణం దక్కింది. 2012 ఒలింపిక్స్‌ ఛాంపియన్‌ అయిన వాల్కాట్‌ బల్లాన్ని (జావలిన్‌) 88.16 మీటర్ల దూరం విసిరాడు. బల్లాన్ని 87.38 మీటర్ల దూరం విసిరిన ఆండర్సన్‌ పీటర్స్‌కు (గ్రెనడా) రజతం దక్కింది. కర్టిస్‌ థామ్సన్‌కు (యూఎస్‌ఏ, 86.67) కాంస్యం లభించింది.

ఈ పోటీల క్వాలిఫికేషన్‌లోనే బల్లాన్ని 84.85 మీటర్ల దూరం విసిరిన నీరజ్‌.. ఫైనల్స్‌లో అంతకంటే హీన ప్రదర్శన చేసి 84.03 మీటర్ల దూరంతో సరిపెట్టుకున్నాడు.

మొదటి ప్రయత్నంలో 83.65 మీటర్లు నమోదు చేసిన నీరజ్‌.. రెండో ప్రయత్నంలో 84.03 మీటర్లతో స్వల్ప మెరుగుదల చూపించాడు. మూడో త్రో ఫౌల్ అయ్యింది. నాలుగో త్రోలో 82.86 మీటర్లు మాత్రమే వచ్చాయి. ఐదో త్రోలో తడబడి మరోసారి ఫౌల్ చేసిన నీరజ్‌, పోటీ నుంచి నిష్క్రమించాడు.

ఇదే పోటీల్లో భారత్‌కే చెందిన సచిన్‌ యాదవ్‌ నీరజ్‌ కంటే మెరుగైన ప్రదర్శన చేసి మెప్పించాడు. బల్లాన్ని 86.27 మీటర్ల దూరం విసిరి తృటిలో కాంస్యం (నాలుగో స్థానం) మిస్‌ అయ్యాడు. ఇదే పోటీలో పాకిస్తాన్‌కు చెందిన అర్షద్‌ నదీమ్‌ నీరజ్‌ కంటే దారుణమైన ప్రద​ర్శన (82.75 మీటర్లు) చేసి పదో స్థానంలో నిలిచాడు.

 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)