నా లక్ష్యం... ‘టోక్యో స్వర్ణం’

Published on Tue, 06/24/2025 - 05:05

ఒ్రస్టావా (చెక్‌ రిపబ్లిక్‌): భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఈ సీజన్‌లో తన ప్రధాన లక్ష్యం ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిలే అని స్పష్టం చేశాడు. చోప్రా తను ఆశించిన 90 మీటర్ల మార్క్‌తో కాకపోయినా... పారిస్‌ డైమండ్‌ లీగ్‌లో 88.16 మీటర్ల దూరంలో ఈటెను విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా ఇక్కడ జరిగే ‘గోల్డెన్‌ స్పైక్‌ అథ్లెటిక్స్‌ మీట్‌’లో పాల్గొనేందుకు వచ్చిన భారత స్టార్‌ మరో విజయంపై కన్నేశాడు. 

రెండు ఒలింపిక్‌ పతకాల విజేత అయిన నీరజ్‌ తన ప్రదర్శనకు చెక్‌ రిపబ్లిక్‌ గ్రేట్‌ జాన్‌ జెలెజ్నీ కోచింగ్‌ ఎంతో దోహదం చేసిందని అన్నాడు. అతని శిక్షణలోనే రాటుదేలిన 27 ఏళ్ల భారత స్టార్‌ ఈ సీజన్‌లో జరిగిన ప్రారంభ దోహా డైమండ్‌ లీగ్‌లో తొలిసారిగా 90 మీటర్ల మార్క్‌ను అందుకున్నాడు. ఈ నేపథ్యంలో చోప్రా మాట్లాడుతూ ‘మేటి అథ్లెట్, కోచ్‌ అయిన జెలెజీ్నతో కలిసి పనిచేయడం చాలా సంతోషానిస్తోంది. 

ఆయన ఇచ్చిన సూచనలు, కిటుకులతోనే ఈ ఏడాది 90 మీటర్ల మార్క్‌ను దాటేశాను. దీన్ని పునరావృతం చేయడంపై దృష్టిసారించాను. ఇక్కడి నైంబర్క్‌లో అహ్లాదకర వాతావరణంలో ట్రెయినింగ్‌ సెషన్‌ పూర్తిచేశాను. తప్పకుండా ఒ్రస్టావాలో నా శక్తి మేర రాణిస్తాను. అయితే నా ప్రధాన లక్ష్యం మాత్రం టోక్యోలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నెగ్గడమే. ఇందుకోసమే క్రమం తప్పకుండా చెమటోడ్చుతున్నాను. తీరిక లేకుండా ఇటు ట్రెయినింగ్‌ సెషన్స్, అటు డైమండ్‌ లీగ్‌లలో పోటీపడుతున్నా’ అని అన్నాడు.

 ఈ సెప్టెంబర్‌ 13 నుంచి 21 వరకు టోక్యోలో ప్రపంచ అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు జరుగనున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లోనే స్వర్ణం గెలుపొందిన తొలి భారతీయ అథ్లెట్‌ అక్కడ మరో పతకాన్ని ఆశిస్తున్నాడు. ప్రస్తుతం ఒ్రస్టావా మీట్‌కు రావడం  చాలా ఆనందంగా ఉందని చోప్రా అన్నాడు. ఒకప్పుడు ఇక్కడ జరిగే పోటీల్లో గ్రేటెస్ట్‌ స్ప్రింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ పోటీని టీవీల్లో చూసి మురిసేవాడినని ఇప్పుడు అదే వేదికపై తాను పోటీ పడుతున్నానని చెప్పుకొచ్చాడు. మంగళవారం ఒస్ట్రావా గోల్డెన్‌ స్పైక్‌ మీట్‌ జరుగుతుంది.

Videos

YSR ఫ్లెక్సీలు చింపేసిన దుండగులు.. కూకట్‌పల్లి లో YSRCP ఆందోళన

42 ఉద్యోగ సంఘాలకు లేఖ రాసిన ఏపీ JAC అమరావతి

Srinivasulu Reddy: కొడుకు కోసం మరీ ఇంత దిగజారుతావా..?

ఆపరేషన్ ‘రాటెన్ యాపిల్’.. న్యూయార్క్‌లో వేలాది మంది వలసదారుల అరెస్ట్

స్పోర్ట్స్ కోటాలో DSC అక్రమాలు బట్టబయలు..

బాబు పబ్లిసిటీపై YS జగన్ ఆగ్రహం

దారుణం చీకటిలోకి నేపాల్..నెక్స్ట్ స్టెప్ ఏంటి..?

ఢిల్లీలో YSR అవార్డ్స్-2026 ప్రదానోత్సవం

జీవీఎంసీ మేయర్ సీటుపై కూటమిలో పీఠముడి

మెదక్ లో కాంగ్రెస్ పాలిటిక్స్

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)