Breaking News

పోలాండ్‌ ఈవెంట్‌కు నీరజ్‌

Published on Thu, 05/15/2025 - 02:13

న్యూఢిల్లీ: భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా పోలాండ్‌ టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. నిజానికి చోప్రా ఈ నెల 24న ‘ఎన్‌సీ క్లాసిక్‌’ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. కానీ భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల వల్ల పలు విమానాశ్రయాల మూసివేతతో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలనుకున్న ఎన్‌సీ క్లాసిక్‌ ఈవెంట్‌ నిరవధికంగా వాయిదా పడింది. ఇపుడు ఇదే సమయంలో పోలాండ్‌లో జరిగే ఈవెంట్‌లో నీరజ్‌ బరిలోకి దిగుతాడు. 

ఈ నెల 23న అక్కడ ‘ఒర్లిన్‌ జానుస్జ్‌ కుసొసిన్సికి మెమోరియల్‌ ఈవెంట్‌’ జరుగనుంది. ఈ ఈవెంట్‌లో పలువురు అంతర్జాతీయ మేటి జావెలిన్‌ త్రోయర్లు పాల్గొంటారు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్, పారిస్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా), జులియన్‌ వెబెర్‌ (జర్మనీ), పోలాండ్‌ జాతీయ రికార్డు నెలకొల్పిన మార్సిన్‌ క్రుకొవ్‌స్కీ తదితరులు పాల్గొంటారు. ఈ సీజన్‌లో దక్షిణాఫ్రికా ఈవెంట్‌తో ఈ సీజన్‌కు శ్రీకారం చుట్టిన చోప్రా ఈ నెల 16న దోహా డైమండ్‌ లీగ్‌లో పాల్గొనాల్సి ఉంది.  

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)