Breaking News

అగ్ర స్థానమే లక్ష్యంగా...

Published on Fri, 06/20/2025 - 02:04

పారిస్‌: భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా ఈ సీజన్‌లో అగ్ర స్థానం లక్ష్యంగా మరో టోర్నీలో బరిలోకి దిగనున్నాడు. ఈ ఏడాది 90 మీటర్ల మార్క్‌ను అందుకున్న ఈ మాజీ ఒలింపిక్, వరల్డ్‌ చాంపియన్‌ పారిస్‌ డైమండ్‌ లీగ్‌లో టాప్‌ ర్యాంక్‌పై కన్నేశాడు. జర్మన్‌ స్టార్‌ జులియన్‌ వెబెర్, రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (గెనడా) తదితర హేమాహేమీలంతా ఈ మీట్‌లో ఉండటంతో జావెలిన్‌ త్రో పోటీ ఆద్యంతం రసవత్తరంగా జరగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

పైగా 8 మంది బరిలోకి దిగుతున్న ఫైనల్‌ ఈవెంట్‌లో ఐదుగురు జావెలిన్‌ త్రోయర్లు 90 మీటర్ల మార్క్‌ను అధిగమించిన వారే ఉండటం పోటీని దీటుగా మార్చేసింది. భారత కాలమానం ప్రకారం నీరజ్‌ ఈవెంట్‌ రాత్రి 1 గంట 12 నిమిషాలకు మొదలవుతంది.  

గత నెలలో జరిగిన దోహా డైమండ్‌ లీగ్‌ మీట్‌లో వెబెర్‌... నీరజ్‌ చోప్రాను అధిగమించాడు. వెబెర్‌ ఈటెను 91.06 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో ... చోప్రా 90.23 మీటర్లతో రెండో స్థానంలో నిలిచారు. అనంతరం జరిగిన పోలాండ్‌ మీట్‌లో ఇద్దరు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయినా... మళ్లీ తొలి రెండు స్థానాల్లో నిలిచారు. 
 

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)