Breaking News

ఎదురులేని హంపి

Published on Mon, 04/21/2025 - 03:05

పుణే: అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌ ఐదో అంచె చెస్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి కోనేరు హంపి జోరు కొనసాగుతోంది. మంగోలియాకు చెందిన అంతర్జాతీయ మాస్టర్‌ (ఐఎం) బత్కుయాగ్‌ మున్‌గున్‌తుల్‌తో ఆదివారం జరిగిన ఆరో రౌండ్‌ గేమ్‌లో నల్ల పావులతో ఆడిన హంపి 33 ఎత్తుల్లో గెలుపొందింది. ఈ టోర్నీలో హంపికిది మూడో విజయం కావడం విశేషం. మరో మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న హంపి 4.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. 

భారత్‌కే చెందిన మరో స్టార్‌ గ్రాండ్‌మాస్టర్, హైదరాబాద్‌కు చెందిన ద్రోణవల్లి హారిక, ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌ దివ్య దేశ్‌ముఖ్‌ల మధ్య జరిగిన ఆరో రౌండ్‌ గేమ్‌ ‘డ్రా’గా ముగిసింది. 27 ఎత్తులయ్యాక గేమ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ ‘డ్రా’కు అంగీకరించారు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి రమేశ్‌బాబు రెండో పరాజయాన్ని చవిచూసింది. జు జినెర్‌ (చైనా)తో జరిగిన ఆరో రౌండ్‌ గేమ్‌లో వైశాలి 41 ఎత్తుల్లో ఓడిపోయింది. 

మెలియా సలోమి (జార్జియా)తో జరిగిన మరో గేమ్‌లో పొలీనా షువలోవా (రష్యా) 45 ఎత్తుల్లో గెలిచింది. నుర్గుల్‌ సలీమోవా (బల్గేరియా), అలీనా కష్లిన్‌స్కాయా (పోలాండ్‌) మధ్య జరిగిన మరో గేమ్‌ 67 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. పది మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్‌లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. ఆరో రౌండ్‌ తర్వాత జు జినెర్‌ ఐదు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 

దివ్య దేశ్‌ముఖ్‌ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో, ద్రోణవల్లి హారిక మూడు పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. నేడు జరిగే ఏడో రౌండ్‌ గేముల్లో సలోమితో సలీమోవా; అలీనాతో వైశాలి; జు జినెర్‌తో హంపి; మున్‌గున్‌తుల్‌తో దివ్య దేశ్‌ముఖ్‌; పొలీనాతో హారిక తలపడతారు.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)