Breaking News

IPL 2024: ఢిల్లీ, ల‌క్నో, గుజరాత్‌ కాదు.. ప్లే ఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవే?

Published on Fri, 04/26/2024 - 17:02

ఐపీఎల్‌-2024 సీజ‌న్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఏడాది ఎడిష‌న్‌లో  సగం పైగా మ్యాచ్‌లు పూర్తయ్యాయి. గ‌త సీజ‌న్‌లో నిరాశ‌ప‌రిచిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్.. ఈ ఏడాది సీజ‌న్‌లో దుమ్ములేపుతున్నాయి.

ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక టాప్‌-4లో రాజ‌స్తాన్ రాయల్స్ 14 పాయింట్ల‌తో అగ్ర స్ధానంలో కొన‌సాగుతుండ‌గా.. ఆ త‌ర్వాత స్ధానాల్లో కోల్‌కతా నైట్ రైడర్స్,  లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జ‌ట్లు ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియ‌న్స్ చెన్నై సూప‌ర్ కింగ్స్ ఐదో స్ధానంలో నిలిచింది.

అయితే 7 విజ‌యాల‌తో తొలి స్ధానంలో ఉన్న రాజ‌స్తాన్ మ‌రో మ్యాచ్‌లో విజ‌యం సాధిస్తే త‌మ ప్లే ఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖారారు చేసుకున్న‌ట్లే. మిగిలిన మూడు స్ధానాలు కోసం మిగితా 9 జ‌ట్లు పోటీప‌డ‌నున్నాయి. అందులో ఆఖ‌రి స్ధానంలో ఉన్న ఆర్సీబీ ప్లే ఆఫ్‌కు చేరే దారులు దాదాపు మూసుకుపోయిన‌ట్లే.

ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే అద్బుతాలు జ‌రిగాలి. ఈ క్ర‌మంలో ప్లే ఆఫ్స్‌కు చేరే జ‌ట్ల‌ను భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అంచనా వేశాడు. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్,  చెన్నై సూపర్ కింగ్స్‌లు క‌చ్చితంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటాయ‌ని సిద్దూ జోస్యం చెప్పాడు.

నాలుగో స్ధానం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జ‌ట్లు పోటీ ప‌డ‌తాయని సిద్దూ స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సిద్దూ పేర్కొన్నాడు. అయితే పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్ధానంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ను  సిద్దూ ఎంపిక చేయకపోవడం గమనార్హం. కాగా ముంబై ఇండియన్స్‌ పాయింట్ల టేబుల్‌లో ప్రస్తుతం 8వ స్ధానంలో ఉంది. అటువంటిది ముంబై ఇండియన్స్‌ను సిద్దూ ఎంచుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)