Breaking News

విరాట్‌ సర్‌, ఐయామ్‌ సారి, మీ కెప్టెన్సీలో ఆడాలని ఉంది.. నవీన్‌ ఉల్‌ హక్‌ రియాక్షన్‌

Published on Sun, 05/28/2023 - 12:48

ఐపీఎల్‌ 2023లో విరాట్‌ కోహ్లితో గొడవ పెట్టుకున్నప్పటి నుంచి లక్నో పేసర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌ను నెటిజన్లు, ముఖ్యంగా విరాట్‌ అభిమానులు, టీమిండియా అభిమానులు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. నవీన్‌.. కోహ్లిని ఉద్దేశిస్తూ ఏ పోస్ట్‌ చేసినా, వారు తగు రీతిలో ఘాటుగా జవాబిస్తున్నారు. ఈ క్రమంలో నవీన్‌ ట్విటర్‌ అకౌంట్‌ నుంచి రెండు రోజుల కిందట వచ్చిన ఓ పోస్ట్‌ నెట్టింట వైరలైంది. 

ఆ ట్వీట్‌లో ఏముందంటే.. విరాట్‌ సర్‌.. ఐయామ్‌ సారి, నేను మీకు పెద్ద అభిమానిని.. చిన్నప్పటి నుంచి మీరే నా ఆరాధ్య క్రికెటర్‌.. నా రూమ్‌ మొత్తం మీ పోస్టర్లతోనే నిండి ఉంటుంది.. లక్నోని వదిలి మీ కెప్టెన్సీలో ఆర్సీబీకి ఆడాలనుంది అంటూ నవీన్‌ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌ పోస్ట్‌ చేసిన నిమిషాల వ్యవధిలోనే నెట్టింట హల్‌చల్‌ చేసింది. నవీన్‌ పశ్చాత్తాపపడుతున్నట్లున్నాడని కోహ్లి అభిమానులు అనుకున్నారు. 

అది నా ట్విటర్‌ అకౌంట్‌ కాదు.. ఫేక్‌: నవీన్‌ ఉల్‌ హక్‌
అయితే, కొద్ది గంటల తర్వాత ఈ ట్వీట్‌ నవీన్‌ ఉల్‌ హక్‌ చేయలేదని తెలిసింది. ఈ విషయంపై అతనే స్వయంగా స్పందించాడు. తన పేరుతో ఎవరో ఫేక్‌ అకౌంట్‌ రన్‌ చేస్తున్నారని, తాను కోహ్లికి క్షమాపణ చెబుతున్నట్లు ట్వీట్‌ చేయలేదని తన అఫిషియల్‌ ఇన్‌స్టా అకౌంట్‌ ద్వారా వివరణ ఇచ్చాడు. 

కాగా, ఆర్సీబీ-లక్నో మధ్య జరిగిన గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ సందర్భంగా కోహ్లి.. గంభీర్‌-నవీన్‌ ఉల్‌ హక్‌ల మధ్య జరిగిన వన్‌ టు టూ ఫైట్‌ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ మ్యాచ్‌ సందర్భంగా వీరు ముగ్గురు బాహాబాహీకి దిగినంత పని చేశారు. అనంతరం వీరు సోషల్‌మీడియా వేదికగా ఒకరని ఒకరు రెచ్చగొట్టుకున్నారు.

ఈ విషయంలో కోహ్లి కాస్త సైలెంట్‌ అయినా నవీన్‌ మాత్రం రెచ్చిపోతూనే ఉన్నాడు. గంభీర్‌ అండదండలతో కోహ్లిని టార్గెట్‌ చేస్తూనే ఉన్నాడు. దీనికి ప్రతిగా కోహ్లి ఆర్మీ సైతం​ గంభీర్‌, నవీన్‌లపై ఎదురుదాడి చేస్తుంది. ఈ క్రమంలోనే ఓ ఫేక్‌ అకౌంట్‌ నుంచి కోహ్లికి అనుకూలంగా ట్వీట్‌ రావడం.. దానిపై నవీన్‌ స్పందించడం జరిగింది.

చదవండి: IPL 2023: చరిత్ర సృష్టించనున్న ఎంఎస్‌ ధోని
 

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)