Breaking News

జాతీయ సీనియర్‌ మహిళల కబడ్డీ చాంపియన్‌షిప్‌ ప్రారంభం

Published on Wed, 01/28/2026 - 04:47

30 జట్లు... 464 మంది క్రీడాకారిణులు...పలువురు అంతర్జాతీయ స్టార్స్‌... తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు హైదరాబాద్‌ విచ్చేశారు. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జాతీయ సీనియర్‌ మహిళల కబడ్డీ చాంపియన్‌షిప్‌ ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్‌ జరగనుంది. తొలి రోజు జరిగిన లీగ్‌ మ్యాచ్‌ల్లో రాజస్తాన్‌ 44–21తో తెలంగాణపై, ఢిల్లీ 61–14తో జమ్మూ కశ్మీర్‌పై, హిమాచల్‌ప్రదేశ్‌ 49–24తో అస్సాంపై, హరియాణా 62–16తో జార్ఖండ్‌పై నెగ్గాయి. 

తెలంగాణ జట్టుకు మహేశ్వరి కెప్టెన్‌గా, గట్టయ్య, బండారి మాధవి కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ప్రారంభోత్సవంలో తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనా రెడ్డి,  తెలంగాణ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని వీరేశ్‌ ముదిరాజ్, కాసాని జ్ఞానేశ్వర్, జగదీశ్వర్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ టోర్నీలో రాణించిన క్రీడాకారిణులను ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల్లో, కబడ్డీ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టు ప్రాబబుల్స్‌గా ఎంపిక చేస్తారు.    

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)