Breaking News

Chess Championship: రాజా రిత్విక్‌కు కాంస్యం 

Published on Thu, 03/07/2024 - 10:29

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ రాజా రిత్విక్‌ కాంస్య పతకం సాధించాడు. నాసిక్‌లో బుధవారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత రిత్విక్‌ 8.5 పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచాడు.

అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... ఆరోణ్యక్‌ ఘోష్‌ (రైల్వేస్‌)కు రెండో ర్యాంక్, రిత్విక్‌కు మూడో ర్యాంక్‌ దక్కాయి. 9 పాయింట్లతో దీప్తాయన్‌ ఘోష్‌ (రైల్వేస్‌) విజేతగా నిలిచాడు.

రిత్విక్‌ ఆడిన 11 గేముల్లో ఏడింటిలో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. కాంస్యం నెగ్గిన రిత్విక్‌ను తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం అధ్యక్షుడు కేఎస్‌ ప్రసాద్‌ అభినందించారు. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన కార్తీక్‌ వెంకటరామన్, నూతక్కి ప్రియాంక 13వ, 14వ ర్యాంక్‌ల్లో నిలిచారు. 

సహజ శుభారంభం 
నాగ్‌పూర్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య మహిళల టర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి సహజ యామలపల్లి శుభారంభం చేసింది. బుధవారం జరిగిన సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సహజ 3–6, 6–1, 6–1తో భారత్‌కే చెందిన వైదేహి చౌదరీని ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరింది.

న్యూజిలాండ్‌తో భారత్‌ తొలి పోరు 
లుసానె (స్విట్జర్లాండ్‌): పారిస్‌ ఒలింపిక్స్‌ పురుషుల హాకీ ఈవెంట్‌ షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు. పూల్‌ ‘బి’లో ఉన్న భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను జూలై 27న న్యూజిలాండ్‌తో ఆడుతుంది. ఈ మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు మొదలవుతుంది.

గత టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన భారత జట్టు తమ రెండో మ్యాచ్‌ను జూలై 29న అర్జెంటీనాతో (సాయంత్రం గం. 4:15 నుంచి)... మూడో మ్యాచ్‌ను జూలై 30న ఐర్లాండ్‌తో (సాయంత్రం గం. 4:45 నుంచి)... నాలుగో మ్యాచ్‌ను ఆగస్టు 1న బెల్జియంతో (మధ్యాహ్నం గం. 1:30 నుంచి)... ఐదో మ్యాచ్‌ను ఆగస్టు 2న ఆ్రస్టేలియా తో (సాయంత్రం గం. 4:45 నుంచి) ఆడుతుంది. 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)