Breaking News

Archery: మెరిసిన సురేఖ, ధీరజ్‌.. టాప్‌లో నిలిచి.. సత్తా చాటి..

Published on Wed, 01/18/2023 - 10:08

కోల్‌కతా: ఈ ఏడాది జరిగే ప్రపంచకప్‌ టోర్నీలు, ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ఆర్చరీ జట్లను ఎంపిక చేసేందుకు నిర్వహించిన ఓపెన్‌ సెలెక్షన్‌ ట్రయల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారులు బొమ్మదేవర ధీరజ్, వెన్నం జ్యోతి సురేఖ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు.

మంగళవారం ముగిసిన ఈ ట్రయల్స్‌లో పురుషుల రికర్వ్‌ విభాగంలో సర్వీసెస్‌ స్పోర్ట్స్‌ కంట్రోల్‌ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ) జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ధీరజ్‌ ఓవరాల్‌గా 2767 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు.

పార్థ్‌ సాలుంకే (మహారాష్ట్ర), జయంత తాలుక్‌దార్‌ (జార్ఖండ్‌), అతాను దాస్‌ (పీఎస్‌పీబీ), సుఖ్‌చెయిన్‌ సింగ్‌ (సర్వీసెస్‌), తరుణ్‌దీప్‌ రాయ్‌ (సర్వీసెస్‌), సుఖ్‌మణి (మహారాష్ట్ర), నీరజ్‌ చౌహాన్‌ వరుసగా రెండు నుంచి ఎనిమిది ర్యాంక్‌ల్లో నిలిచారు. తద్వారా ఈ ఏడాది జరిగే అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనే భారత జట్టులో చోటు సంపాదించేందుకు అర్హత పొందారు.

మరోవైపు మహిళల కాంపౌండ్‌ విభాగంలో జ్యోతి సురేఖ ఓవరాల్‌గా 2828 పాయింట్లు సాధించి టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. సురేఖతోపాటు పర్ణీత్‌ కౌర్, అదితి, ప్రగతి, సాక్షి చౌదరీ, ముస్కాన్, ఐశ్వర్య శర్మ, సృష్టి సింగ్‌ కూడా ఈ ఏడాది జరిగే మెగా ఈవెంట్స్‌లో పాల్గొనే టీమిండియా సెలెక్షన్స్‌కు అర్హత పొందారు. మహిళల రికర్వ్‌ విభాగం ట్రయల్స్‌లో ‘ట్రిపుల్‌ ఒలింపియన్‌’ దీపిక కుమారి ఏడో ర్యాంక్‌లో నిలిచి భారత జట్టులో పునరాగమనం చేయడానికి అర్హత సాధించింది.

చదవండి: IND vs NZ 1st ODI: టీమిండియాతో తొలి వన్డే.. న్యూజిలాండ్‌కు బిగ్‌ షాక్‌
WTC- Ind Vs Aus: పిచ్‌లు అలా ఉంటే టీమిండియాదే సిరీస్‌.. కనీసం ఈసారైనా..

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)