Breaking News

పారిస్‌ ఒలింపిక్స్‌కు నగాల్‌ క్వాలిఫై

Published on Sun, 06/23/2024 - 04:03

భారత నంబర్‌వన్‌ టెన్నిస్‌ ఆటగాడు సుమీత్‌ నగాల్‌ వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్నాడు. తాను పారిస్‌ ఒలింపిక్స్‌కు అధికారికంగా అర్హత సాధించినట్లు నగాల్‌ స్వయంగా వెల్లడించాడు. ‘2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు నేను అర్హత సాధించాననే విషయాన్ని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. 

నా మనసులో ఒలింపిక్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. కాబట్టి ఇది  చెప్పుకోదగ్గ క్షణం. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడం నా కెరీర్‌ విశేషాల్లో చెప్పుకోదగ్గ అంశం. ఆ తర్వాతినుంచి పారిస్‌ ఒలింపిక్స్‌ లక్ష్యంగా శ్రమించాను. మెగా ఈవెంట్‌లో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నా’ అని నగాల్‌ ట్వీట్‌ చేశాడు. గత ఏడాది కాలంగా మంచి ఫామ్‌తో వరుస విజయాలు సాధించిన నగాల్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 71వ స్థానానికి ఎగబాకాడు. 

రెండు చాలెంజర్‌ టైటిల్స్‌ గెలవడంతో పాటు ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ మెయిన్‌ డ్రాకు అర్హత సాధించి రెండో రౌండ్‌ వరకు చేరుకున్నాడు. పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న – శ్రీరామ్‌ బాలాజీ జోడి భారత్‌ తరఫున బరిలోకి దిగనుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో బోపన్న ప్రస్తుతం టాప్‌–10లో ఉండటంతో తన భాగస్వామిని ఎంచుకునే అవకాశం అతనికి కలిగింది.   

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)