Breaking News

భారత జట్టు హెడ్‌కోచ్‌గా ముజుందార్.. త్వరలోనే ప్రకటన

Published on Tue, 07/04/2023 - 10:48

భారత మహిళల జట్టు హెడ్‌కోచ్‌గా ముంబై మాజీ ఆటగాడు అమోల్ ముజుందార్ భాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడు ఈ హెడ్‌కోచ్‌ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. జూలై 9న బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌తో భారత జట్టు ప్రధానకోచ్‌గా ముజుందార్ ప్రయాణం ప్రారంభం కానుంది.

దీనిపై బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా కాగా గత డిసెంబర్‌లో మహిళల జట్టు హెడ్‌కోచ్‌గా ఉన్న రమేశ్ పొవార్‌ని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి బీసీసీఐ బదిలి చేసింది. దీంతో అప్పటి నుంచి ప్రధాన కోచ్ లేకుండానే భారత మహిళల జట్టు ఆడుతూ వస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత మహిళల జట్టు హెడ్‌ కోచ్‌ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది.

హెడ్‌కోచ్‌ పదవి కోసం ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు జోన్ లూయిస్, భారత మాజీ కోచ్‌ ‍తుషార్ అరోథే వంటి వారు దరఖాస్తు చేసుకున్నారు. కానీ అశోక్ మల్హోత్రా, జతిన్ పరంజ్‌పే,  సులక్షణా నాయక్‌లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (CAC) కమిటీ ముజుందార్ పేరును ఖారారు చేసినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

ఇక  ముజుందార్‌కు కోచ్‌గా  అపారమైన అనుభవం ఉంది. ముజుందార్‌ ప్రస్తుతం రాజస్తాన్‌ రాయల్స్‌ కోచింగ్‌ స్టాప్‌లో భాగంగా ఉన్నాడు. అదే విధంగా గతంలో నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచ్‌గా కూడా పనిచేశాడు. 48 ఏళ్ల ముజుందార్‌  2019లో భారత పర్యటనలో దక్షిణాఫ్రికాకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కూడా పనిచేశాడు.
చదవండి: బంగ్లాదేశ్‌ టూర్‌కు భారత జట్టు ఎంపిక.. స్టార్‌ ప్లేయర్‌పై వేటు

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)