Breaking News

ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్‌.. స్టార్ ప్లేయర్ రాకకు లైన్ క్లియర్‌!

Published on Fri, 05/16/2025 - 18:19

ఐపీఎల్ 2025 పునఃప్రారం వేళ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓ గుడ్ న్యూస్ అందింది. ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లో ఆడేందుకు ముస్తఫిజుర్ రెహ్మాన్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అతడు శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ వారం రోజులు వాయిదా పడడంతో చాలా మంది ఫారన్ ప్లేయర్లు తమ స్వదేశానికి వెళ్లిపోయారు. అయితే ఐపీఎల్ రీ స్టార్ట్ అవుతుండడంతో కొంతమంది తిరిగి భారత్‌కు రావడానికి సిద్దపడితే, మరి కొంతమంది నిరాకరించారు. అందులో ఒకరు ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్‌.

ఐపీఎల్ 16వ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు తన అందుబాటులో ఉండడని మెక్‌గర్క్ ఢిల్లీ ఫ్రాంచైజీకి తెలియజేశాడు. ఈ క్రమంలో మెక్‌గర్క్ స్ధానంలో బంగ్లాపేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. అయితే ఇక్కడే అస్సలు ట్విస్ట్  చోటు చేసుకుంది. ముస్తఫిజుర్‌తో ఢిల్లీ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికి అతడు యూఏఈతో టీ20 సిరీస్ ఆడేందుకు దుబాయ్‌కు పయనమయ్యాడు.

యాదృచ్ఛికంగా యూఏఈ-బంగ్లా సిరీస్ కూడా మే 17 నుంచి ప్రారంభం కానుంది. దీంతో అతడు తిరిగి భారత్‌కు వస్తాడా లేదా అన్న సందిగ్ధం నెలకొంది. ఎట్టకేలకు బంగ్లా క్రికెట్ బోర్డు అతడికి ఎన్‌వోసీ మంజారు చేయడంతో ఢిల్లీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

కాగా ఈ ఏడాది సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్లు మిచెల్ స్టార్క్‌, ఫాఫ్ డుప్లెసిస్ సైతం దూరమయ్యారు. ఈ ఏడాది సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ మూడు మ్యాచ్‌ల‌లోనూ ఢిల్లీ విజ‌యం సాధిస్తే ఎటువంటి సమీకరణాలు అవ‌స‌రం లేకుండా ప్లే ఆఫ్స్‌కు ఆర్హ‌త సాధిస్తోంది.
 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)