Breaking News

ముంబై ఇండియన్స్‌ బోణీ

Published on Wed, 02/19/2025 - 01:01

వడోదర: ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నిలో తొలి మ్యాచ్‌లో ఓడిన ముంబై ఇండియన్స్‌(Mumbai Indians) రెండో పోరులో విజయాన్ని అందుకొని పాయింట్ల ఖాతా తెరిచింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌(Gujarat Giants)పై ఘన విజయం సాధించింది. గుజరాత్‌కు ఈ టోర్నిలో ఇది రెండో పరాజయం. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటైంది.

హర్లీన్‌ డియోల్‌ (31 బంతుల్లో 32; 4 ఫోర్లు), కాశ్వీ గౌతమ్‌ (15 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మాత్రమే కొద్దిగా ప్రభావం చూపగలిగారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హేలీ మాథ్యూస్‌ (3/16) రాణించగా...అమెలియా కెర్, నాట్‌ సివర్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ముంబై 16.1 ఓవర్లలో 5 వికెట్లకు 122 పరుగులు చేసింది. నాట్‌ సివర్‌ బ్రంట్‌ (39 బంతుల్లో 57; 11 ఫోర్లు) దూకుడుగా ఆడి జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లింది. నేడు జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో యూపీ వారియర్స్‌ జట్టు తలపడుతుంది.  

స్కోరు వివరాలు 
గుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మూనీ (సి) సంస్కృతి గుప్తా (బి) నాట్‌ సివర్‌ 1; వోల్‌వార్ట్‌ (సి) సజన (బి) షబ్నమ్ 4; హేమలత (సి) కెర్‌ (బి) హేలీ 9; ఆష్లీ గార్డ్‌నర్‌ (సి) సంజన (బి) నాట్‌ సివర్‌ 10; హర్లీన్‌ (సి) హేలీ (బి) కౌర్‌ 32; డాటిన్‌ (స్టంప్డ్‌) యస్తిక (బి) కెర్‌ 7; కాశ్వీ (సి) భాటియా (బి) హేలీ 20; సిమ్రన్‌ (సి) కెర్‌ (బి) హేలీ 3; తనూజ (సి) సంస్కృతి గుప్తా (బి) కెర్‌ 13; సయాలీ (నాటౌట్‌) 13; ప్రియ (రనౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్‌) 120. వికెట్ల పతనం: 1–6, 2–14, 3–16, 4–28, 5–43, 6–67, 7–79, 8–103, 9–103, 10–120. 

బౌలింగ్‌: షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ 4–1–17–1, నాట్‌ సివర్‌ 4–0–26–2, హేలీ మాథ్యూస్‌ 4–0–16–3, అమేలియా కెర్‌ 4–0–22–2, పరుణిక 2–0–20–0, అమన్‌జోత్‌ కౌర్‌ 2–0–17–1. ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: హేలీ మాథ్యూస్‌ (సి) హర్లీన్‌ (బి) తనూజ కన్వర్‌ 17; యస్తిక (సి) వోల్‌వార్ట్‌ (బి) ప్రియ 8; నాట్‌ సివర్‌ (బి) ప్రియ 57; హర్మన్‌ప్రీత్‌ (ఎల్బీ) (బి) కాశ్వీ 4; కెర్‌ (ఎల్బీ) (బి) కాశ్వీ 19; సజన (నాటౌట్‌) 10; కమలిని (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (16.1 ఓవర్లలో 5 వికెట్లకు) 122.  వికెట్ల పతనం: 1–22, 2–46, 3–55, 4–100, 5–114. బౌలింగ్‌: ఆష్లీ గార్డ్‌నర్‌ 3–0–21–0, తనూజ 3–0–25–1, డియాండ్ర డాటిన్‌ 3.1–0–19–0, ప్రియ మిశ్రా 4–0–40–2, కాశ్వీ గౌతమ్‌ 3–0–15–2.   

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)