ముంబై ‘ఫైనల్‌’ రేసులో...

Published on Tue, 03/11/2025 - 04:07

ముంబై: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) లో అగ్రస్థానంతో నేరుగా ఫైనల్‌ చేరేందుకు ముంబై ఇండియన్స్‌ జట్టు విజయం దూరంలో నిలిచింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 9 పరుగుల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై గెలుపొందింది. మొదట ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ (33 బంతుల్లో 54; 9 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించింది. తర్వాత గుజరాత్‌ 20 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. 

భారతి (25 బంతుల్లో 61; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) ముంబై బౌలర్లపై విరుచుకుపడింది. జెయింట్స్‌ ఒకదశలో 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమికి సిద్ధమవగా... భారతి ధనాధన్‌ ఆటతో ఆశలు రేపింది. 41 బంతుల్లో 88 పరుగుల సమీకరణం ఆఖరి ఓవర్‌కు వచ్చేసరికి 6 బంతుల్లో 13 పరుగులుగా మారింది. కానీ 20వ ఓవర్‌ వేసిన హేలీ... తనూజ (10)ను రనౌట్‌ చేసింది. 

తర్వాతి బంతికి సిమ్రాన్‌ (18; 1 ఫోర్, 1 సిక్స్‌), చివరి బంతికి ప్రియా (1) వికెట్లు తీసి ఆలౌట్‌ చేసింది. నేడు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగే లీగ్‌ దశ ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిస్తే ముంబై 12 పాయింట్లతో పట్టికలో టాప్‌ లేపి నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ క్యాపిటల్స్‌ 10 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నా... మెరుగైన రన్‌రేట్‌ కారణంగా ఢిల్లీ ‘టాప్‌’లో ఉంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)