Breaking News

కొత్త కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కి ఊహించని షాక్

Published on Sat, 12/16/2023 - 13:05

ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్‌ శర్మను ముంబై ఫ్రాంచైజీ యాజమన్యం తప్పించింది. అతడి స్ధానంలో భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు తమ జట్టు పగ్గాలు అప్పగించింది. ముంబై ఇండియన్స్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వాత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

ఏకంగా 5 ఐపీఎల్ టైటిల్స్‌ను అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు ముంబై ఇండియన్స్‌ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. "షేమ్‌ ఆన్‌ ముంబై ఇండియన్స్‌"(#ShameOnMI) అనే హ్యాష్‌ట్యాగ్‌ను తెగ ట్రేండ్‌ చేస్తున్నారు.

ముంబై ఇండియన్స్‌కి ఊహించని షాక్
హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ప్రకటించిన కొన్ని గంటలలోపే ముంబై ఇండియన్స్‌కి ఊహించని షాక్ తగిలింది. సోషల్‌ మీడియాలో భారీగా తమ ఫాలోవర్లను ముంబై ఫ్రాంచైజీ కోల్పోయింది. సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో ముంబై అధికారిక పేజిని 4 లక్షల మంది అన్‌ఫాలో చేశారు. అదే విధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా  1.5 లక్షల మంది ఫాలోవర్లను ముంబై ఇండియన్స్‌ కోల్పోయింది.

రోహిత్ ను విపరీతంగా అభిమానించే అభిమానులు ముంబై జట్టును అన్ ఫాలో కొట్టడంతో ఇప్పుడు ఆ జట్టు బ్రాండ్ వాల్యూ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది.  కాగా ఐపీఎల్‌-2024 సీజన్‌ వేలానికి ముందు హార్దిక్‌ పాండ్యాను గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ముంబై ఇండియన్స్‌ ట్రేడింగ్‌ ద్వారా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌.. ఆ ఇద్దరూ కూడా! బీసీసీఐ అధికారిక ప్రకటన

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)