హర్మన్‌ ధనాధన్‌.. ఫ్లే ఆఫ్స్‌కు ముంబై ఇండియన్స్‌

Published on Sun, 03/10/2024 - 00:51

న్యూఢిల్లీ: భారీ స్కోర్ల మ్యాచ్‌లో కెప్టెన్  హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (48 బంతుల్లో 95 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసం ముంబై ఇండియన్స్‌ను గెలిపించింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో శనివారం జరిగిన పోరులో ముంబై 7 వికెట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై గెలుపొందింది. ముందుగా గుజరాత్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. దయాళన్‌ హేమలత (40 బంతుల్లో 74; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ బెత్‌ మూనీ (35 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు.

వీరిద్దరు రెండో వికెట్‌కు 10.2 ఓవర్లలోనే 121 పరుగులు జోడించారు. మూనీ 27 బంతుల్లో, హేమలత 28 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తిచేసుకున్నారు. ఒక దశలో ఓవర్‌కు పది పరుగుల పైచిలుకు దూసుకెళ్లిన రన్‌రేట్‌... తర్వాత ఓవర్‌కు ఒక వికెట్‌ చొప్పున కోల్పోవడంతో నెమ్మదించింది. సైకా ఇషాక్‌ 2 వికెట్లు తీసింది. అనంతరం ముంబై 19.5  ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు యస్తిక భాటియా (36 బంతుల్లో 49; 8 ఫోర్లు, 1 సిక్స్‌), హేలీ మాథ్యూస్‌ (18; 4 ఫోర్లు) తొలి వికెట్‌కు 50 పరుగులతో శుభారంభం ఇచ్చారు.

వీళ్లిద్దరితో పాటు నట్‌ సీవర్‌ బ్రంట్‌ (2) వికెట్‌నూ వంద పరుగుల్లోపే కోల్పోయిన ముంబై కష్టాల్లో పడింది. 15.4 ఓవర్లలో ముంబై స్కోరు 121/3. విజయానికి 26 బంతుల్లో 70 పరుగులు కావాలి. ఈ దశలో హర్మన్‌ప్రీత్‌ (వ్యక్తిగత స్కోరు 29 బంతుల్లో 40) ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను బౌండరీ వద్ద లిచ్‌ఫీల్డ్‌ జారవిడిచింది. దీనిని సద్వినియోగం చేసుకున్న హర్మన్‌ ఆ తర్వాత విధ్వంసకరంగా ఆడింది. చేయాల్సిన 70 పరుగుల్లో ఆమె ఒక్కతే 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 పరుగులు (19 బంతుల్లో) సాధించడంతో ముంబై గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతుంది. 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)