Breaking News

ఎంసీఏ కీల‌క నిర్ణ‌యం.. ముంబై మెంటార్‌గా మాజీ క్రికెట‌ర్‌

Published on Thu, 05/30/2024 - 11:28

దేశవాళీ క్రికెట్‌ సీజన్ (2024-25)కు ముందు ముంబై క్రికెట్ అసోసియేష‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ జ‌ట్టు బౌలింగ్  మెంటార్‌గా భారత మాజీ పేస‌ర్ ధావల్ కులకర్ణిని ముంబై క్రికెట్ అసోసియేష‌న్ నియ‌మించింది.  కులకర్ణి దేశ‌వాళీ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల‌లో ముంబై జ‌ట్టు బౌలింగ్ మెంటార్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. 

ఈ మెర‌కు ఎంసీఏ గురువారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. కుల‌క‌ర్ణికి అంత‌ర్జాతీయ క్రికెట్‌లో పెద్ద‌గా అనుభ‌వం లేన‌ప్ప‌ట‌కి దేశీవాళీ క్రికెట్‌లో మాత్రం ముంబై త‌ర‌పున‌ అద్భుత‌మైన ట్రాక్ రికార్డు ఉంది. 2014లో అంత‌ర్జాతీయ అరంగేట్రం చేసిన కుల‌క‌ర్ణి..  టీమిండియా త‌ర‌పున 12 వ‌న్డేలు, రెండు టీ20ల్లో ప్రాతినిథ్యం వ‌హించాడు. 

ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో మాత్రం కుల‌క‌ర్ణి 96  మ్యాచ్‌ల్లో ఏకంగా 285 వికెట్లు ప‌డగొట్టాడు. రంజీట్రోఫీ 2023-24 సీజ‌న్ ట్రోఫీని ముంబై సొంతం చేసుకోవ‌డంలో కుల‌క‌ర్ణి కీల‌క పాత్ర పోషించాడు.

రికార్డు స్ధాయిలో  42వ సారి రంజీ ట్రోఫీని ముంబై గెలుచుకున్న అనంత‌రం కుల‌కర్ణి.. ఈ ఏడాది మార్చిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి త‌ప్ప‌కున్నాడు. ఈ క్ర‌మంలోనే అత‌డి సేవ‌ల‌ను ఉప‌యెగించుకోవాల‌ని భావించిన ఎంసీఏ.. మెంటార్ ప‌దవిని క‌ట్ట‌బెట్టింది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)