Breaking News

‘బాయ్‌’ ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ కోచ్‌గా ముల్యో హండోయో

Published on Fri, 08/11/2023 - 21:15

అస్సాం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) గువాహటిలో కొత్తగా నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (ఎన్‌సీఈ)ను అధునాతన సొబగులు, క్రీడా సదుపాయాలతో తీర్చిదిద్దింది. దీనికి హెడ్‌ కోచ్‌గా ఇండోనేసియాకు చెందిన ప్రఖ్యాత కోచ్‌ ముల్యో హండోయోను ‘బాయ్‌’ నియమించింది. హండోయోకు భారత షట్లర్లతో విజయవంతమైన అనుబంధముంది.

హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, గురుసాయిదత్‌ తదితరుల ప్రతిభకు మెరుగులు దిద్ది... చైనా షట్లర్లకు ఎదురునిలిచే నైపుణ్యాన్ని ముల్యోనే నేర్పారు. ఆయన కోచింగ్‌ హయాంలోనే శ్రీకాంత్‌ ప్రపంచ నంబర్‌వన్‌గా ఎదిగాడు. అలాగే మరో ఇద్దరు విదేశీ కోచ్‌లను కూడా ఎన్‌సీఈకి నియమించారు.

మాజీ ఆల్‌ఇంగ్లండ్‌ చాంపియన్‌ ఇవాన్‌ సొజొనొవ్‌ (రష్యా) డబుల్స్‌ కోచ్‌గా, కొరియాకు చెందిన సింధు మాజీ కోచ్‌ పార్క్‌ తే సంగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తారు. అస్సాం, బాయ్‌ ఉమ్మడి భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఎన్‌సీఈలో 24 కోర్టులున్నాయి. 3000 మంది ప్రేక్షకులు వీక్షించవచ్చు. శిక్షణపొందే షట్లర్లు, సిబ్బంది కోసం సౌకర్యవంతమైన వసతి గదులు, కసరత్తుకు జిమ్, ఇతరత్రా అధునాతన సదుపాయాలెన్నో ఉన్నాయి. ఈ సెంటర్‌ను శుక్రవారం లాంఛనంగా ప్రారంభిస్తారు.    

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)