Breaking News

వన్డేల్లో అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా

Published on Mon, 09/04/2023 - 13:57

అంతర్జాతీయ వన్డేల్లో ఆఫ్గానిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ ముజీబ్ ఉర్ రెహ్మాన్ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో వరుసగా  రెండు సార్లు హిట్‌వికెట్‌గా వెనుదిరిగిన తొలి ఆటగాడిగా ముజీబ్‌ నిలిచాడు.

ఆసియాకప్‌-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌వికెట్‌గా ఔటైన ముజీబ్‌.. ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆఫ్గాన్‌ ఇన్నింగ్స్‌ 45 ఓవర్‌ వేసిన తస్కిన్ అహ్మద్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టి మరి ముజీబ్‌ హిట్‌వికెట్‌గా ఔటయ్యాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌తో  ఆడిన వన్డేలో కూడా ముజీబ్‌ హిట్‌ వికెట్‌గానే వెనుదిరిగాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే..  బంగ్లా చేతిలో 89 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్‌ ఓటమి పాలైంది. అదే విధంగా ఈ విజయంతో బంగ్లాదేశ్‌ తమ సూపర్‌- ఆశలను సజీవంగా నిలుపుకుంది.

ఇక మంగళవారం లాహోర్‌లో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ గెలిస్తే మాత్రం బంగ్లాదేశ్‌తో కలిసి ఈ మూడు జట్లు రెండు పాయింట్లతో సమానంగా నిలుస్తాయి.  ఈ సమయంలో మెరుగైన రన్‌రేట్‌ ఉన్న రెండు జట్లు ‘సూపర్‌–4’ దశకు అర్హత సాధిస్తాయి.
చదవండి: Asia Cup 2023: ఆసియాకప్‌ మ్యాచ్‌లపై నీలినీడలు.. ఇది నాకు ముందే తెలుసు! చెత్త కారణాలు చెప్పారు

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)