Breaking News

అప్పుడే నాకు తెలియకుండా నా ఫోటోలు తీశారు! ఇంకా ఎన్నో గెలవాలి!

Published on Sat, 08/26/2023 - 02:36

బాకు (అజర్‌బైజాన్‌): ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరిన సంచలనం సృష్టించిన భారత గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌. ప్రజ్ఞానంద ప్రదర్శనపై అతని తల్లి నాగలక్ష్మి సంతోషం వ్యక్తం చేసింది. అతని కెరీర్‌ ఆరంభం నుంచి అన్నింటా తోడుగా ఉంటూ వచ్చిన నాగలక్ష్మి వరల్డ్‌ కప్‌లోనూ ప్రజ్ఞానంద వెన్నంటే నిలిచింది.

అతను ఫైనల్‌ చేరడంతో పాటు క్యాండిడేట్స్‌ టోర్నీకి కూడా అర్హత సాధించడం గొప్పగా అనిపిస్తోందన్న ఆమె... తన కొడుకు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ‘‘ప్రపంచకప్‌లో ప్రజ్ఞానంద ఫైనల్‌ వరకు రావడం చాలా సంతోషంగా ఉంది. పైగా క్యాండిడేట్స్‌కు అర్హత సాధించడం దానిని రెట్టింపు చేసింది.

అతను మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలి. అర్జున్‌తో క్వార్టర్‌ ఫైనల్‌ జరుగుతున్నప్పుడు ప్రజ్ఞ ఏం చేస్తున్నాడనే ఉత్కంఠతోనే అలా చూస్తూ ఉండిపోయాను. అప్పుడే నాకు తెలియకుండా కొందరు నా ఫోటోలు తీశారు. అవే జనంలోకి వెళ్లాయి. చివరకు ఆ మ్యాచ్‌లో మా అబ్బాయి గెలిచాడు’ అని నాగలక్ష్మి గుర్తు చేసుకుంది.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)