Breaking News

ఇదేమి జట్టురా బాబు.. మొన్న 15 పరుగులు! ఇప్పుడు 22 పరుగులకే ఆలౌట్‌

Published on Thu, 09/21/2023 - 08:38

చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఏషియన్‌ గేమ్స్‌-2023లో మంగోలియా మహిళల క్రికెట్‌ జట్టు మరోసారి ఘోర ప్రదర్శన కనబరిచింది. వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన మంగోలియా.. టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది.

ఈ ఈవెంట్‌లో భాగంగా బుధవారం హాంకాంగ్‌తో జరిగిన క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఏకంగా 180 పరుగుల తేడాతో మంగోలియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హాంకాంగ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. 

హాంకాంగ్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ కారీ చాన్ (70) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడగా.. యీ షాన్ టోనోట్(34 నాటౌట్‌),మర్యం బీబీ(30) పరుగులతో రాణించారు. కాగా మంగోలియన్‌ బౌలర్లు ఏకంగా 36 పరుగులు ఎక్స్‌ట్రాస్‌గా ఇవ్వడం గమనార్హం. 

22 పరుగులకే ఆలౌట్‌
అనంతరం 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మంగోలియా 12.4 ఓవర్లలో కేవలం 22 పరుగులకే కుప్పకూలింది. హాంకాంగ్‌ బౌలర్లలో అలిసన్ సియు, కానీ చాన్‌ తలా రెండు వికెట్లు సాధించగా.. బీబీ, యూసఫ్‌, అమండా చెయుంగ్ చెరో వికెట్‌ సాధించారు. 

కాగా అంతకుముందు మ్యాచ్‌లో కూడా ఇండోనేషియాపై మంగోలియా ఈ తరహా ప్రదర్శనే చేసింది. ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్‌లో మంగోలియా కేవలం 15 పరుగులకే ఆలౌటైంది. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్‌ నమోదు చేసిన రెండో జట్టుగా మంగోలియా చెత్త రికార్డు నెలకొల్పింది.
చదవండి: ODI World Cup 2023: వరల్డ్‌కప్‌కు ముందు దక్షిణాఫ్రికాకు బిగ్‌ షాక్‌.. స్టార్‌ ప్లేయర్‌ ఔట్‌!

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)