Breaking News

‘నా కుమారుడికి అవకాశాలు ఇవ్వలేదు.. నాశనం చేశారు’

Published on Fri, 09/13/2024 - 17:56

పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్‌ మొయిన్‌ ఖాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కుమారుడు ఆజం ఖాన్‌ కెరీర్‌ను ఉద్దేశపూర్వకంగానే నాశనం చేశారని ఆరోపించాడు. రమీజ్‌ రాజా ఇష్టారీతిన వ్యవహరించి యువ ఆటగాళ్ల భవిష్యత్తును ప్రమాదంలో పడేశాడని.. అతడి నిర్ణయాల వల్లే జట్టు పరిస్థితి ఇలా తయారైందని విమర్శించాడు.

రాణించని ఆజం ఖాన్‌
కాగా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఆజం ఖాన్‌ 2021లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా పాకిస్తాన్‌ తరఫున అరంగ్రేటం చేశాడు. ఇప్పటిదాకా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో  13 మ్యాచ్‌లు ఆడి..  135.38 స్ట్రైక్‌రేటుతో 88 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, గణాంకాలు అత్యంత సాధారణంగా ఉన్న టీ20 ప్రపంచకప్‌-2024 జట్టులో ఆజం ఖాన్‌కు చోటు దక్కింది.

ఈ క్రమంలో మెగా టోర్నీలో ఒకే ఒక మ్యాచ్‌ ఆడిన ఆజం ఖాన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా అమెరికా చేతిలో ఓడిన పాక్‌ జట్టు.. కనీసం సూపర్‌-8కు చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఫలితంగా తీవ్ర విమర్శలపాలైంది.

బాడీ షేమింగ్‌.. విమర్శలు
ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై చర్చ జరుగగా.. ఆజం ఖాన్‌ను బాడీ షేమింగ్‌ చేశారు చాలా మంది. మొయిన్‌ ఖాన్‌ కొడుకు కాబట్టే బంధుప్రీతితో అతడి లాంటి వాళ్లకు కూడా జాతీయ జట్టులో చోటు దక్కుతోందని మండిపడ్డారు. అయితే, తాజాగా ఈ విషయంపై స్పందించిన మొయిన్‌ ఖాన్‌ పీసీబీపైనే విమర్శలు చేయడం విశేషం.

మనకు మంచి ఆటగాళ్లు ఎలా దొరుకుతారు?
‘‘వరల్డ్‌కప్‌ 2024 మ్యాచ్‌లన్నీ నేను చూశాను. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కాబట్టి ఆజం ఖాన్‌కు అన్ని మ్యాచ్‌లలో అవకాశం ఇస్తారనుకున్నా. కానీ ఒక్క మ్యాచ్‌లో విఫలం కాగానే పక్కనపెట్టారు. ఇలాంటి యువ ఆటగాళ్ల ఉత్సాహాన్ని ఆదిలోనే నీరుగారిస్తే.. ఎప్పుటికప్పుడు ప్లేయర్లను మార్చివేస్తూ ఉంటే.. పటిష్ట జట్టు ఎలా రూపుదిద్దుకుంటుంది.

కనీస సంఖ్యలోనైనా అవకాశాలు ఇవ్వాలి. లేనిపక్షంలో మనకు మంచి ఆటగాళ్లు ఎలా దొరుకుతారు? గతంలో ప్రపంచకప్‌-2022 సమయంలో రమీజ్‌ రాజా నా కుమారుడు ఆజం ఖాన్‌ను జట్టు నుంచి తప్పించాడు.

సెలక్టర్లు అతడిని ఎంపిక చేసినా కావాలనే పక్కనపెట్టాడు. ఇలాంటి వాళ్ల జట్టు ఇలా తయారైంది’’ అని 52 ఏళ్ల మొయిన్‌ ఖాన్‌ పీసీబీ ప్రస్తుత, మాజీ యాజమాన్యంపై విమర్శలు గుప్పించాడు. తన కుమారుడికి ప్రతిభ ఉన్నా అవకాశాలు రావడం లేదంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. 

చదవండి: విఫలమైన సంజూ శాంసన్‌.. సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)