Breaking News

మోహన్‌ బగాన్‌ ‘టాప్‌’ షో

Published on Sun, 12/15/2024 - 04:10

బెంగళూరు: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో మోహన్‌ బగాన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ జోరు కొనసాగుతోంది. లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో మోహన్‌ బగాన్‌ జట్టు 3–2 గోల్స్‌ తేడాతో కేరళ బ్లాస్టర్స్‌పై విజయం సాధించింది. మొహన్‌ బగాన్‌ తరఫున జేమీ మెక్‌లారెన్‌ (33వ నిమిషంలో), జాసన్‌ కమింగ్స్‌ (86వ ని.లో), అల్బెర్టో రోడ్రిగ్వేజ్‌ (90+5వ ని.లో) తలా ఒక గోల్‌ సాధించారు. కేరళ బ్లాస్టర్స్‌ తరఫున జెసెస్‌ జిమెనెజ్‌ (51వ ని.లో), మిలోస్‌ డ్రింకిక్‌ (77వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. 

తాజా సీజన్‌లో 11 మ్యాచ్‌లాడిన మోహన్‌ బగాన్‌ జట్టు 8 విజయాలు, ఒక పరాజయం, 2 ‘డ్రా’లతో 26 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. కేరళ బ్లాస్టర్స్‌ 11 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 7 పరాజయాల, 2 ‘డ్రా’లతో 11 పాయింట్లు సాధించి పట్టిక పదో స్థానంలో కొనసాగుతోంది. బెంగళూరు ఫుట్‌బాల్‌ క్లబ్, గోవా ఫుట్‌బాల్‌ క్లబ్‌ మధ్య శనివారమే జరిగిన మరో మ్యాచ్‌ 2–2 గోల్స్‌తో ‘డ్రా’గా ముగిసింది. 

బెంగళూరు తరఫున ర్యాన్‌ విలియమ్స్‌ (71వ నిమిషంలో), జార్జ్‌ డియాజ్‌ (83వ ని.లో) చెరో గోల్‌ చేయగా... గోవా తరఫున సందేశ్‌ జింగాన్‌ (7వ ని.లో), సాహిల్‌ తవోరా (66వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. తొలి సగంలో ప్రత్యర్థికి ఆధిక్యం సమర్పించుకున్న బెంగళూరు జట్టు... ద్వితీయార్థంలో సత్తాచాటి స్కోరు సమం చేసింది. 

తాజా సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన బెంగళూరు 7 విజయాలు, 2 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 24 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో రెండో స్థానంలో ఉండగా... గోవా (19 పాయింట్లు) నాలుగో స్థానంలో కొనసాగుతోంది.  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)