Breaking News

చాంపియన్‌ మోహన్‌ బగాన్‌

Published on Sun, 04/13/2025 - 02:16

కోల్‌కతా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) 11వ సీజన్‌లో మోహన్‌ బగాన్‌ సూపర్‌ జెయింట్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో మోహన్‌ బగాన్‌ జట్టు 2–1 గోల్స్‌ తేడాతో బెంగళూరు ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ)పై విజయం సాధించింది. వరుసగా మూడోసారి ఫైనల్‌ చేరిన మోహన్‌ బగాన్‌ జట్టుకు ఇది రెండో ఐఎస్‌ఎల్‌ టైటిల్‌ కావడం విశేషం. 2024–25 లీగ్‌ దశలో అద్వితీయ ఆటతీరుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి లీగ్‌ షీల్డ్‌ దక్కించుకున్న మోహన్‌ బగాన్‌ జట్టు... ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించింది. 

తుదిపోరులో మోహన్‌ బగాన్‌ జట్టు తరఫున జాసన్‌ కమిన్స్‌ (72వ నిమిషంలో), జేమీ మెక్‌లారెన్‌ (96వ నిమిషంలో) చెరో గోల్‌ చేశారు. మోహన్‌ బగాన్‌ జట్టు స్ట్రయికర్‌ అల్బెర్టో రోడ్రిగ్జ్‌ (49వ నిమిషంలో) సెల్ఫ్‌ గోల్‌తో బెంగళూరు ఖాతా తెరిచింది. మోహన్‌ బగాన్‌ ఆటగాళ్ల తప్పిదం వల్ల ఆట 49వ నిమిషంలోనే బెంగళూరు గోల్స్‌ ఖాతా తెరవగా... ద్వితీయార్ధంలో చెలరేగిపోయిన మోహన్‌ బగాన్‌ రెండు గోల్స్‌తో విజయ పతాక ఎగరవేసింది. మోహన్‌ బగాన్‌ జట్టు 20 షాట్స్‌ ఆడగా... అందులో ఆరింటిని ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై సంధించగలిగింది. 

బెంగళూరు జట్టు 18 షాట్స్‌లో నాలుగింటిని ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పైకి కొట్టింది. మ్యాచ్‌లో అత్యధిక శాతం బంతిని తమ నియంత్రణలో ఉంచుకోగలిగిన బెంగళూరు... ఫినిషింగ్‌ లోపాలతో గోల్స్‌ చేయలేకపోయింది. స్టార్‌ స్ట్రయికర్‌ సునీల్‌ ఛెత్రీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం బెంగళూరు విజయావకాశాలపై ప్రభావం చూపింది. ఓవరాల్‌గా మ్యాచ్‌లో 62 శాతం బంతిని తమ ఆధినంలో ఉంచుకున్న బెంగళూరు జట్టు 512 పాస్‌లు కొట్టగా... 38 శాతం బంతిని నియంత్రించిన మోహన్‌ బగాన్‌ జట్టు 318 పాస్‌లు ఇచ్చుకుంది. 

పాస్‌ల కచ్చితత్వంలోనూ బెంగళూరు 78 శాతంతో మెరుగైన ప్రదర్శన కనబర్చగా... మోహన్‌ బగాన్‌ 65 శాతంతో వెనుకబడింది. 2022–23 సీజన్‌లోనూ ఈ రెండు జట్ల మధ్యే ఐఎస్‌ఎల్‌ ఫైనల్‌ జరగగా... అప్పుడు కూడా బెంగళూరుపై మోహన్‌ బగాన్‌ జట్టు విజయం సాధించింది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)