Breaking News

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం.. మహ్మద్‌ హఫీజ్‌కు ప్రమోషన్‌

Published on Thu, 11/16/2023 - 17:01

పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ హఫీజ్‌కు ఆ దేశ క్రికెట్‌ బోర్డు కీలక బాధ్యతలు అప్పగించింది. పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు డైరెక్టర్‌గా హాఫీజ్‌ను పీసీబీ నియమించింది. ఇప్పటివరకు ఆ జట్టు డైరెక్టర్‌గా పనిచేసిన మిక్కీ ఆర్థర్ స్ధానాన్ని హాఫీజ్‌ భర్తీ చేయనున్నాడు. కాగా ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యంతో విదేశీ కోచింగ్ స్టాఫ్‌ మొత్తాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు తొలిగించింది.

ఇప్పటికే మోర్నీ మోర్కెల్‌ బౌలింగ్‌ కోచ్‌ పదవికి రాజీనామా చేయగా.. తాజాగా మిక్కీ ఆర్థర్‌పై పీసీబీ వేటు వేసింది. ఈ క్రమంలోనే టెక్నికల్‌ కమిటీలో సభ్యునిగా ఉన్న హాఫీజ్‌కు టీమ్‌  డైరెక్టర్‌గా పీసీబీ ప్రమోషన్‌ ఇచ్చింది. అదేవిధంగా కొత్త కోచింగ్‌ స్టాప్‌ను పీసీబీ త్వరలోనే ప్రకటించనుంది. మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్‌ పాకిస్తాన్‌  పురుషుల క్రికెట్‌ జట్టు  డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు.

పాకిస్తాన్ కోచింగ్ స్టాఫ్ పోర్ట్‌ఫోలియోను పీసీబీ మార్చింది. ప్రస్తుతం ఉన్న కోచ్‌లు అందరూ కూడా నేషనల్ క్రికెట్ అకాడమీలో పనిచేస్తారు. వారిలో కొంతమందిని జట్టు కోసం ఎంపిక చేస్తుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీస్‌లకు త్వరలోనే మా కొత్త కోచింగ్‌ స్టాప్‌ను ప్రకటించనున్నామని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది.

పాకిస్తాన్ తరఫున హఫీజ్ 55 టెస్టులు, 218 వన్డేలు, 119 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్‌ల్లో కలిపి 12,780 పరుగులు చేయడంతోపాటు 253 వికెట్లు కూడా సాధించాడు. కాగా ఇప్పటికే  పాకిస్తాన్‌ కెప్టెన్సీకి బాబర్‌ ఆజం గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.

టీ20ల్లో పాకిస్తాన్‌ కొత్త కెప్టెన్‌గా షాహీన్‌ అఫ్రిది ఎం‍పిక కాగా.. టెస్టు సారథిగా షాన్‌ మసూద్‌ నియమితుడయ్యాడు.  కాగా ఈ ఏడాది డిసెంబర్‌లో పాకిస్తాన్‌ టెస్టు సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే హెడ్‌కోచ్‌ లేకుండానే ఆసీస్‌ పర్యటను పాక్‌ జట్టు వెళ్లనుంది. ఈ క్రమంలో జట్టు డైరక్టర్‌గా ఉన్న  హఫీజ్‌ హెడ్‌కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
చదవండి: World Cup 2023: ఇదేమి బ్యాటింగ్‌ రా బాబు.. అందుకే 'చోకర్స్‌' ట్యాగ్‌ లైన్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)