Breaking News

అజారుద్దీన్‌కు బిగ్‌ షాక్‌

Published on Sat, 04/19/2025 - 17:29

టీమిండియా మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ అజారుద్దీన్‌కు భారీ షాక్‌ తగిలింది. హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో (ఉప్పల్‌ స్టేడియం) నార్త్‌ స్టాండ్‌కు అజారుద్దీన్‌ పేరును తొలగించాలని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య ఆదేశించారు. లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్‌పై విచారణ జరుపుతూ ఈ మేరకు తీర్పునిచ్చారు. 

అజారుద్దీన్‌ హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఉన్న కాలంలో నార్త్‌ స్టాండ్‌కు తన పేరును పెట్టుకున్నాడు. ఈ  నిర్ణయం చెల్లదని జస్టిస్‌ ఈశ్వరయ్య స్పష్టం చేశారు. ఈ నిర్ణయంలో విరుద్ధ ప్రయోజనాలున్నాయని తెలిపారు. వెంటనే నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరు తొలగించాలని హెచ్‌సీఏను ఆదేశించారు. టికెట్లపై ఇక నుంచి అజారుద్దీన్‌ పేరును ముద్రించరాదని తేల్చి చెప్పారు.

కాగా, 2019లో అజారుద్దీన్‌ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉండగా.. ఉప్పల్‌ స్టేడియంలోని నార్త్‌ స్టాండ్‌కు తన పేరును పెట్టుకున్నాడు. ఆ ఏడాది డిసెంబర్‌ 7న భారత దిగ్గజ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఈ స్టాండ్‌ను ప్రారంభించారు. అజారుద్దీన్‌ భారత్‌ తరఫున 99 టెస్ట్‌లు, 334 వన్డేలు ఆడి మొత్తంగా 29 సెంచరీలు చేశాడు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)