Breaking News

మ్యాక్స్‌వెల్‌ సేనకు కలిసొచ్చిన అదృష్టం.. నేరుగా ఫైనల్స్‌కు

Published on Wed, 07/09/2025 - 08:56

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2025 ఎడిషన్‌లో భారతకాలమానం ప్రకారం ఇవాళ (జులై 9) జరగాల్సిన క్వాలిఫయర్‌ (వాషింగ్టన్‌ ఫ్రీడం వర్సెస్‌ టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌) మ్యాచ్‌ వర్షం కారణంగా పూర్తిగా రద్దైంది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన వాషింగ్టన్‌ జట్టు ఫైనల్స్‌కు చేరింది. 

ఫాఫ్‌ డుప్లెసిస్‌ నేతృత్వంలోని టీఎస్‌కే జులై 11న జరిగే ఛాలెంజర్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఆ మ్యాచ్‌లో టీఎస్‌కే జులై 9న జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌ (శాన్‌ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌ వర్సెస్‌ ఎంఐ న్యూయార్క్‌) విజేతతో తలపడనుంది. ఛాలెంజర్‌లో గెలిచిన జట్టు జులై 13న జరిగే ఫైనల్లో వాషింగ్టన్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.

ఇవాళ జరగాల్సిన క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఎడతెరిపిలేని వర్షం​ కారణంగా టాస్‌ కూడా పడకుండానే రద్దైంది. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 5:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండింది. 8:15 గంటల వరకు వేచి చూసిన అంపైర్లు వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 

దీంతో మ్యాక్స్‌వెల్‌ నేతృత్వంలోని వాషింగ్టన్‌ ఫ్రీడం మ్యాచ్‌ ఆడకుండానే అదృష్టం కలిసొచ్చి నేరుగా ఫైనల్‌కు చేరింది. ఈ సీజన్‌ పాయింట్ల పట్టికలో వాషింగ్టన్‌ టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. టీఎస్‌కే రెండో స్థానంలో నిలిచింది. శాన్‌ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌, ఎంఐ న్యూయార్క్‌ జట్లు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు ఎలాంటి ముప్పు లేదు
శాన్‌ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌, ఎంఐ న్యూయార్క్‌ మధ్య రేపు జరగాల్సిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు ఎలాంటి ముప్పు లేదని తెలుస్తుంది. డల్లాస్‌లో రేపు వాతావరణం క్లియర్‌గా ఉండనుందని వాతావరణ శాఖ నివేదించింది. ఇవాల్టి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ కూడా డల్లాస్‌లోనే ఉండింది. 
 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)