Breaking News

డుప్లెసిస్‌ మెరుపు అర్ద సెంచరీ.. రషీద్‌ ఖాన్‌ వీరోచిత పోరాటం​

Published on Mon, 07/15/2024 - 14:40

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎంఎల్‌సీ) 2024 ఎడిషన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌తో ఇవాళ (భారతకాలమానం ప్రకారం​) జరిగిన మ్యాచ్‌లో టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది.

డుప్లెసిస్‌ మెరుపు అర్ద సెంచరీ
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌.. ఓపెనర్లు డుప్లెసిస్‌ (38 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డెవాన్‌ కాన్వే (28 బంతుల్లో 40; 3 ఫోర్లు, సిక్సర్‌) చెలరేగి ఆడటంతో ఓ మోస్తరు స్కోర్‌ చేసింది. సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌లో ఆరోన్‌ హార్డీ 22, జాషువ ట్రంప్‌ 3, మిలింద్‌ కుమార్‌ 2, సావేజ్‌ 10 పరుగులు చేసి ఔట్‌ కాగా.. స్టోయినిస్‌ 24, డ్వేన్‌ బ్రావో 7 పరుగులతో అజేయంగా నిలిచారు. ముంబై ఇండియన్స్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ (4-0-17-1) పొదుపుగా బౌలింగ్‌ చేయగా.. ట్రెంట్‌ బౌల్ట్‌ 2, నోష్తుష్‌ కెంజిగే, ఎహసాన్‌ ఆదిల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

రషీద్‌ ఖాన్‌ వీరోచిత పోరాటం వృధా
177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌.. 52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. మెనాంక్‌ పటేల్‌ (45 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), రషీద్‌ ఖాన్‌ (23 బంతుల్లో 50; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆదుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రషీద్‌ పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు బ్యాటింగ్‌ చేశాడు. రషీద్‌ వీరోచితంగా పోరాడినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌లో కీరన్‌ పోలార్డ్‌ (17 బంతుల్లో 5), టిమ్‌ డేవిడ్‌ (10 బంతుల్లో 6) చాలా బంతులు వృధా చేశారు. సూపర్‌ కింగ్స్‌ బౌలర్లలో స్టోయినిస్‌ 4, జియా ఉల్‌ హక్‌ 2, మొహమ్మద్‌ మోహిసిన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

ఇదిలా ఉంటే, మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ రెండో ఎడిషన్‌ జులై 5న మొదలైన విషయం తెలిసిందే. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో వాషింగ్టన్‌ ఫ్రీడం (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) టాప్‌లో ఉండగా.. టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌, శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌, లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌రైడర్స్‌, సీయాటిల్‌ ఓర్కాస్‌ వరుస స్థానాల్లో ఉన్నాయి. లీగ్‌లో భాగంగా రేపు (రాత్రి ఒంటి గంటకు) జరుగబోయే మ్యాచ్‌లో సీయాటిల్‌ ఓర్కాస్‌, శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్‌ తలపడనున్నాయి.

Videos

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)