Breaking News

డ్వేన్‌ బ్రావో ఊచకోత.. అయినా గెలవలేకపోయిన సూపర్‌ కింగ్స్‌

Published on Mon, 07/17/2023 - 11:14

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2023లో టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ తొలి ఓటమిని ఎదుర్కొంది. వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌తో ఇవాళ (జులై 17) జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ కింగ్స్‌ 6 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. వెటరన్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో మెరుపు ఇన్నింగ్స్‌తో (39 బంతుల్లో 76 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడినప్పటికీ సూపర్‌ కింగ్స్‌ గెలవలేకపోయింది. వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌ బౌలర్లు మూకుమ్మడిగా రాణించి, తమ జట్టుకు సీజన్‌ తొలి గెలుపును అందించారు. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌.. మాథ్యూ షార్ట్‌ (50 బంతుల్లో 80; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. షార్ట్‌తో పాటు ముక్తర్‌ అహ్మద్‌ (20), మోసస్‌ హెన్రిక్స్‌ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సూపర్‌ కింగ్స్‌ బౌలర్లలో గెరాల్డ్‌ కోయెట్జీ 2 వికెట్లు పడగొట్టగా.. మిచెల్‌ సాంట్నర్‌, మోహిసిన్‌ ఖాన్‌, డ్వేన్‌ బ్రావో తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సూపర్‌ కింగ్స్‌.. ఛేదనలో తడబడింది. మార్కో జన్సెన్‌ బౌలింగ్‌లో డెవాన్‌ కాన్వే తొలి బంతికే క్లీన్‌ బౌల్డ్‌ కాగా.. కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ (14) మరోసారి విఫలమయ్యాడు. ఆతర్వాత బరిలోకి దిగిన లహీరు మిలంత (15), డేవిడ్‌ మిల్లర్‌ (14), మిలింద్‌ కుమార్‌ (3), మిచెల్‌ సాంట్నర్‌ (22) కూడా విఫలమైనా ఏడో నంబర్‌లో వచ్చిన బ్రావో సూపర్‌ కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చేందుకు శక్తిమేరకు ప్రయత్నించాడు. అతనికి మరో ఎండ్‌లో సహకారం​ లేకపోవడంతో సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 157 పరుగులు మాత్రమే చేసి, ఓటమిపాలైంది.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు