Breaking News

రఫ్ఫాడించిన క్లాసెన్‌.. రాణించిన హెట్‌మైర్‌

Published on Sun, 07/16/2023 - 15:07

అమెరికాలో జరుగుతున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ తొలి ఎడిషన్‌లో సీటిల్‌ ఓర్కాస్‌ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, లీగ్‌లో అజేయ జట్టుగా నిలిచింది. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో సీటిల్‌ ఆర్కాస్‌ జట్టు.. శాన్‌ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌పై 35 పరుగుల తేడాతో గెలుపొందింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్కాస్‌ టీమ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టా​నికి 177 పరుగులు చేసింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (31 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీతో రఫ్ఫాడించగా.. హెట్‌మైర్‌ (36 నాటౌట్‌), నౌమన్‌ అన్వర్‌ (30), జయసూర్య (33) రాణించారు. యునికార్న్స్‌ బౌలర్లలో ప్లంకెట్‌ 2 వికెట్లు పడగొట్టగా.. హరీస్‌ రౌఫ్‌, కోరె ఆండర్సన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యునికార్న్స్‌.. కెమరూన్‌ గ్యానన్‌ (4/23), ఆండ్రూ టై (2/27), ఇమాద్‌ వసీం (2/24), హర్మీత్‌ సింగ్‌ (1/15) చెలరేగడంతో 17.5 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది.

యునికార్న్స్‌ ఇన్నింగ్స్‌లో షాదాబ్‌ ఖాన్‌ (37) టాప్‌ స్కోరర్‌ కాగా.. మాథ్యూ వేడ్‌ (28), ఫిన్‌ అలెన్‌ (28), మార్కస్‌ స్టోయినిస్‌ (15), ఆరోన్‌ ఫించ్‌ (14), కోరె ఆండర్సన్‌ (12) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో డికాక్‌, క్లాసెన్‌లు కలిసి ఏకంగా 7 క్యాచ్‌లు పట్టడం విశేషం. లీగ్‌లో రేపు జరుగబోయే తదుపరి మ్యాచ్‌లో లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌ రైడర్స్‌.. ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌ జట్లు తలపడనున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)