Breaking News

శివాలెత్తిన రొస్సో.. నైట్‌ రైడర్స్‌ ఖాతాలో తొలి విజయం

Published on Mon, 07/24/2023 - 12:34

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ సీజన్‌ 2023లో లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌ రైడర్స్‌ తొలి విజయం నమోదు చేసింది. నిన్న (జులై 23) సీయాటిల్‌ ఆర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. రిలీ రొస్సో (38 బంతుల్లో 78 నాటౌట్‌; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) అజేయమైన మెరుపు హాఫ్‌ సెంచరీతో విరుచుకుపడి నైట్‌ రైడర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. రొస్సోకు ఆండ్రీ రసెల్‌ (29 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకరించాడు. ఫలితంగా నైట్‌ రైడర్స్‌.. ఆర్కాస్‌ నిర్ధేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి మరో 5 బంతులు మిగిలుండగానే ఛేదించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్కాస్‌.. షెహన్‌ జయసూర్య (45 బంతుల్లో 60 నాటౌట్‌; 7 ఫోర్లు, సిక్స్‌) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. స్టార్‌ బ్యాటర్‌ డికాక్‌ (10) విఫలం కాగా.. నౌమన్‌ అన్వర్‌ (32; 5 ఫోర్లు), క్లాసెన్‌ (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్‌) పర్వాలేదనిపించాడు. నైట్‌ రైడర్స్‌ బౌలర్లలో ఆడమ్‌ జంపా 2 వికెట్లు పడగొట్టగా.. స్పెన్సర్‌ జాన్సన్‌, ఆండ్రీ రసెల్‌, వాన్‌ షాల్విక్‌, కెప్టెన్‌ సునీల్‌ నరైన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌ రైడర్స్‌కు మంచి ఆరంభం లభించనప్పటికీ.. రొస్సో, రసెల్‌ ఆ జట్టును గెలిపించారు. 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో బరిలోకి దిగిన రొస్సో ఆఖరి వరకు క్రీజ్‌లో నిలబడి నైట్‌ రైడర్స్‌కు సీజన్‌ తొలి విజయాన్ని అందించాడు. నైట్‌ రైడర్స్‌ ఇన్నింగ్స్‌లో జేసన్‌ రాయ్‌ (2), జస్కరన్‌ మల్హోత్రా (2), గజానంద్‌ సింగ్‌ (3),సునీల్‌ నరైన్‌ (8) విఫలం కాగా.. సైఫ్‌ దర్బార్‌ (10), వాన్‌ షాల్విక్‌ (12), ఆడమ్‌ జంపా (12) రెండంకెల స్కోర్లు చేశారు. ఆర్కాస్‌ బౌలర్లలో కెమరాన్‌ గానన్‌ 3 వికెట్లతో రాణించగా.. ఆండ్రూ టై 2, ఇమాద్‌ వసీం, కెప్టెన్‌ వేన్‌ పార్నెల్‌, హర్మీత్‌ సింగ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)