Breaking News

సింధు పరాజయం 

Published on Sat, 03/09/2024 - 02:05

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత షట్లర్లకు క్వార్టర్‌ ఫైనల్లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచ నంబర్‌వన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లగా, రెండు వరుస ఒలింపిక్‌ పతకాల విజేత పీవీ సింధుకు క్వార్టర్‌ ఫైనల్లో చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సింధు 24–22, 17–21, 18–21తో ఒలింపిక్‌ చాంపియన్‌ చెన్‌ యూ ఫె (చైనా) చేతిలో పోరాడి ఓడింది.

గంటా 32 నిమిషాల పాటు భారత స్టార్‌ తుదికంటా పోరాడినా ఫలితం దక్కలేదు. ప్రపంచ రెండో ర్యాంకర్‌ చెన్‌ యూ ఫెకు దీటుగా కోర్టులో శ్రమించడంతో ర్యాలీలు సుదీర్ఘంగా సాగాయి. దీంతో తొలిగేమ్‌ హోరాహోరీగా సాగింది. 22–22 వద్ద సింధు క్రాస్‌కోర్టు షాట్లతో విరుచుకుపడి తొలిగేమ్‌ నెగ్గింది. తర్వాత రెండో గేమ్‌లో సరీ్వస్‌ వైఫల్యంతో వెనుకబడిన సింధు గేమ్‌ను కోల్పోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లోనూ ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు.

కానీ చైనా ప్రత్యర్థి పైచేయి సాధించడంతో మ్యాచ్‌లో ఓటమి తప్పలేదు. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌సీడ్‌ సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 21–19, 21–13తో థాయ్‌లాండ్‌కు చెందిన సుపక్‌ జొమ్‌కొ–కిటినుపాంగ్‌ కెడ్రెన్‌ జోడీపై విజయం సాధించింది.  పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌ కూడా సెమీస్‌ చేరుకున్నాడు. క్వార్టర్స్‌ మ్యాచ్‌లో లక్ష్య 19–21, 21–15, 21–13 స్కోరుతో లో కీన్‌ యూ (సింగపూర్‌)ను ఓడించాడు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)