గుజరాత్‌ జెయింట్స్‌ నుంచి వైదొలిగిన టీమిండియా మాజీ కెప్టెన్‌

Published on Wed, 12/11/2024 - 16:09

మహిళల ఐపీఎల్‌ (WPL) 2025 సీజన్‌ వేలానికి (డిసెంబర్‌ 15) ముందు గుజరాత్‌ జెయింట్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు మెంటార్‌ మరియు అడ్వైజర్‌ మిథాలీ రాజ్‌ (భారత మహిళల క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌) బాధ్యతల నుంచి తప్పుకొంది. వాస్తవానికి మిథాలీ కాంట్రాక్ట్‌ మరో ఏడాది పాటు ఉండింది. అయితే ఇతరత్రా కారణాల చేత మిథాలీ మరో ఏడాది కాంట్రాక్ట్‌ ఉండగానే బాధ్యతల నుంచి తప్పుకుంది. 

మిథాలీ ఇటీవలే ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మిథాలీతో పాటు గుజరాత్‌ జెయింట్స్‌ బౌలింగ్‌ కోచ్‌ నూషిన్‌ అల్‌ ఖదీర్‌ కూడా తన బాధ్యతల నుంచి తప్పుకుంది. అల్‌ ఖదీర్‌ కాంట్రాక్ట్‌ ఈ ఏడాదితోనే ముగిసింది. అయితే అల్‌ ఖదీర్‌ కాంట్రాక్ట్‌ పునరుద్ధరించమని ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని కోరలేదు. అల్‌ ఖదీర్‌ ప్రస్తుతం భారత అండర్‌-19 మహిళల జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తుంది. 

మెంటార్‌ మరియు బౌలింగ్‌ కోచ్‌ ప్రత్యామ్నాయాలను గుజరాత్‌ జెయింట్స్‌ రేపటి లోగా ప్రకటించవచ్చు. హెడ్‌ కోచ్‌ మైఖేల్‌ క్లింగర్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ కార్ల్‌ హాప్కిన్సన్‌ యధావిధిగా తమ బాధ్యతల్లో కొనసాగుతారని జెయింట్స్‌ యాజమాన్యం ప్రకటించింది. కాగా, గుజరాత్‌ జెయింట్స్‌ జట్టు గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ఈ ఫ్రాంచైజీ రెండు సీజన్లలో అట్టడుగు స్థానాల్లో నిలిచింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)