Breaking News

భార్య ఆట చూద్దామని వస్తే నిరాశే మిగిలింది

Published on Fri, 06/23/2023 - 09:20

ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పురుషుల క్రికెట్‌లో తొలి టెస్టు ముగిసింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఇరుజట్లు లార్డ్స్‌ వేదికగా జూన్‌ 28 నుంచి రెండో టెస్టుకు సిద్దమవుతున్నాయి. 

తాజాగా గురువారం నాటింగ్‌హమ్‌ వేదికగా ఆస్ట్రేలియా వుమెన్స్‌, ఇంగ్లండ్‌ వుమెన్స్‌ మధ్య యాషెస్‌ ఏకైక టెస్టు ప్రారంభమైంది. మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వుమెన్స్‌ తొలిరోజు ఆధిక్యం కనబరిచింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 85 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. అనాబెల్‌ సదర్లాండ్‌ 39 పరుగులు, అలానా కింగ్‌ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఎలీస్‌ పెర్రీ 99 పరుగులు చేసి ఒక్క పరుగుతో సెంచరీ చేజార్చుకోగా.. తాహిలా మెక్‌గ్రాత్‌ 61 పరుగులు, అష్ష్లే గార్డనర్‌ 40 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో సోఫీ ఎసెల్‌స్టోన్‌ మూడు వికెట్లు, లారెన్‌ ఫైలర్‌ రెండు వికెట్లు పడగొట్టింది.

కాగా ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌, వుమెన్‌ క్రికెటర్‌ అలీసా హేలీలు భార్యభర్తలన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టుకు మిచెల్‌ స్టార్క్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే రెండో టెస్టులో బరిలోకి దిగే అవకాశం ఉంది. మ్యాచ్‌కు ఐదురోజులు సమయం ఉండడంతో స్టార్క్‌ తన భార్య ఆట చూడడం కోసం స్టేడియం దగ్గర క్యూలైన్‌లో నిల్చొని వెళ్లడం ఆసక్తి కలిగించింది. భార్య ఆటను ఎంజాయ్‌ చేయాలని భావించిన మిచెల్‌ స్టార్క్‌కు నిరాశే మిగిలింది. మ్యాచ్‌లో అలీసా హేలీ డకౌట్‌గా వెనుదిరిగింది. ఆమె ఔటైన తర్వాత స్టార్క్‌ ఇచ్చిన రియాక్షన్‌ వైరల్‌గా మారింది.

చదవండి: సస్పెన్షన్‌ వేటు.. బౌలర్‌కు షాకిచ్చిన ఐసీసీ

ఐదు బంతుల్లో 5 సిక్సర్లు బాదిన ఆర్‌సీబీ స్టార్‌

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు