Breaking News

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు భారీ షాక్‌.. విధ్వంస‌క‌ర ఆట‌గాడికి గాయం

Published on Sat, 04/06/2024 - 16:34

ఐపీఎల్‌-2024లో భాగంగా ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌మ తదుప‌రి మ్యాచ్‌లో ఏప్రిల్ 7 వాంఖ‌డే వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో త‌ల‌ప‌నడ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు మిచెల్ మార్ష్ గాయం కార‌ణంగా ముంబైతో మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ఈ విష‌యాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ధృవీకరించాడు.

అయితే మార్ష్‌కు ఎటువంటి గాయ‌మైందో, కోలుకోవ‌డానికి ఎంత సమయం పడుతుంద‌న్న విష‌యాన్ని దాదా వెల్లడించలేదు. కాగా ఈ ఏడాది సీజ‌న్‌లో మార్ష్ ఇప్ప‌టివ‌ర‌కు త‌న స్ధాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయాడు. బ్యాటింగ్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో 71 ప‌రుగులు చేసిన మార్ష్‌.. అటు బౌలింగ్‌లో కేవ‌లం ఒకే ఒక్క వికెట్ ప‌డ‌గొట్టాడు.

ఇక అత‌డి స్ధానంలో మ‌రో ఆసీస్ యువ సంచ‌ల‌నం జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ ఐపీఎల్ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. మ‌రోవైపు కుల్దీప్ యాద‌వ్ కూడా ముంబైతో మ్యాచ్‌కు దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది.

తొడ కండ‌రాల గాయంతో బాధ‌ప‌డుతున్న కుల్దీప్ కోలుకోవ‌డానికి మరి కొంత స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. కాగా ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఏడాది సీజ‌న్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ కేవ‌లం ఒకే ఒక మ్యాచ్‌లో విజ‌యం సాధించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)