Breaking News

మీరాబాయికి నాలుగో స్థానం

Published on Thu, 08/08/2024 - 07:21

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం త్రుటిలో చేజారింది. బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 49 కేజీల విభాగంలో భారత స్టార్‌ మీరాబాయి చాను నాలుగో స్థానంలో నిలిచింది. 12 మంది పోటీపడ్డ ఫైనల్లో మీరాబాయి మొత్తం 199 కేజీల బరువెత్తి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ముందుగా మీరాబాయి స్నాచ్‌లో 88 కేజీలు... తర్వాత క్లీన్‌ అండ్‌ జెర్క్‌ అంశంలో 111 కేజీలు బరువెత్తింది. గత టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి రజత పతకాన్ని కైవసం చేసుకుంది.

 హు జిహుయ్‌ (చైనా; స్నాచ్‌లో 93 కేజీలు+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 117 కేజీలు) మొత్తం 206 కేజీల బరువెత్తి  స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మిహేలా వలెంటీనా (రొమేనియా; స్నాచ్‌లో 93 కేజీలు+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 112 కేజీలు) మొత్తం 205 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించింది. సురోద్‌చనా ఖాంబావ్‌ (థాయ్‌లాండ్‌; స్నాచ్‌లో 88 కేజీలు+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 112 కేజీలు) 200 కేజీల బరువెత్తి మూడో స్థానంతో కాంస్య పతకాన్ని గెల్చుకుంది. పారిస్‌లోనూ మీరాబాయి పతకం సాధించి ఉంటే ఒలింపిక్స్‌ వ్యక్తిగత క్రీడాంశంలో రెండు పతకాలు గెలిచిన నాలుగో భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందేది. 

అవినాశ్‌కు 11వ స్థానం 
మరోవైపు బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌ ఫైనల్లో భారత అథ్లెట్‌ అవినాశ్‌ సాబ్లే 8 నిమిషాల 14.18 సెకన్లలో గమ్యానికి చేరి 11వ స్థానంలో నిలిచాడు. సూఫియాన్‌ (మొరాకో) స్వర్ణం, రూక్స్‌ (అమెరికా) రజతం, కిబివోట్‌ (కెన్యా) కాంస్యం గెలిచారు.

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)