Breaking News

మిల్కాసింగ్‌ అస్తమయం: బావురుమన్న అభిమానులు

Published on Sat, 06/19/2021 - 11:30

సాక్షి, న్యూఢిల్లీ : పరుగుల వీరుడు, లెజండరీ అథ్లెట్‌  మిల్కాసింగ్‌ (91) అస్తమయం అటు క్రీడాభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అటు "ఫ్లయింగ్ సిక్‌’’  మిల్కా సింగ్ మరణంపై రాజకీయ, వ్యాపార, సినిమా రంగ  ప్రముఖులను విస్మయానికి గురిచేసింది. దాదాపు నెల రోజులపాలు కరోనా  మహమ్మారితో పోరాడిన  ఆయన కోలుకున్న అనంతరం కరోనా సంబంధిత సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై మరణంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

గత ఐదు దశాబ్దాలుగా ఎందరికో స్పూర్తిగా నిలిచిన మిల్కా సింగ్  నిష్క్రమణతో ప్రపంచ  వ్యాపప్తంగా ఆయన అభిమానులో శోకసంద్రంలో ముగినిపోయారు.  ఇంకా  రాజకీయ, క్రీడా వ్యాపార ప్రపంచానికి చెందిన  అనేక మంది ప్రముఖులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడా దిగ్గజాలు ట్విటర్‌ వేదికగా నివాళులర్పించారు. ‘మీ మరణం ప్రతి భారతీయుడి హృదయంలో తీవ్ర శూన్యతను మిగిల్చింది, కాని మీరు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారు" అని  ప్రముఖ క్రికెటర్‌ సచిన్ టెండూల్కర్ నివాళులర్పించారు. ‘ మీ మరణం విచారకరం. దిగులు మేఘాలు ఆవరించాయి’ అంటూ  పరుగుల రాణి  పీటీ ఉష సంతాపం తెలిపారు. ఇంకా సునీల్‌ చేత్రి, సురేష్‌ రైనా, అనిల్‌కుంబ్లే, జస్‌ప్రీత్‌ బుమ్రా, వెంకటేశ్‌ ప్రసాద్‌ తదితరులు ట్విటర్‌ ద్వారా తమ విచారాన్ని వ్యక్తం చేశారు.
(ప్రపంచ అథ్లెటిక్స్‌లో మిల్కాసింగ్‌ది చెరగని ముద్ర: సీఎం జగన్‌)

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఇంకా ప్రముఖ వ్యాపార వేత్త మహీంద్రా గ్రూప్ డైరెక్టర్ ఆనంద్‌ మహీంద్ర కూడా ట్విటర్‌ ద్వారా మిల్కాసింగ్‌ మరణంపై విచారం వ్యక్తం చేశారు. ‘మిల్కా సింగ్  గొప్పదనాన్ని మా తరం ఎలా వివరించగలదు? ఆయన అథ్లెట్ మాత్రమే కాదు. వలసవాదం నుండి బయటపడిన తరువాత కూడా అసురక్షితంగా ఉన్న సమాజానికి ప్రతీక…మనం ప్రపంచంలోనే అత్యుత్తముడు ఆయన. తమకెంతో విశ్వాసాన్నిచ్చిన ఆయనకు ధన్యవాదాలు. ఓం శాంతి’ అంటూ ఆనంద్ మహీంద్రా  ట్వీట్‌ చేశారు. (దిగ్గజ అథ్లెట్‌ మిల్కాసింగ్‌ కన్నుమూత)

స్ప్రింటర్ మిల్కా సింగ్ మరణంపై బాలీవుడ్, టాలీవుడ్‌, ఇతర సినీరం ప్రముఖులు కూడా  నివాళులు అర్పించారుబాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ఆయన మరణం తీవ్రవిచారం వ్యక్తం చేశారు. నటి  ప్రియాంక చోప్రా దేశానికి ఆయన చేసిన సేవలను మరవలేనివంటూ సింగ్‌తో తనతొలి సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు. ప్లయింగ్‌ సిక్‌ భౌతికంగా దూరమైనా ఆయన ఉనికి సజీవమే. తనతోపాటు లక్షలాది మంది ప్రేరణ రెస్ట్ ఇన్ పీస్ మిల్కా సింగ్ సార్ అని పేర్కొన్నారు. తాప్సీ ‘ఫ్లయింగ్ సిఖ్‌ మనకు దూరమై పోయారంటూ ట్వీట్‌ చేశారు.

Deeply saddened by the passing away of sports legend #MilkhaSingh. A monumental loss for our nation.. His incredible legacy will continue to inspire athletes all the over the world. Rest in peace sir. 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) June 19, 2021


కాగా దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ కల్లోలం రేపింది. అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. మిల్కా సింగ్ భార్య, ఇండియన్ ఉమెన్ నేషనల్ వాలీబాల్ జట్టు మాజీ కెప్టెన్ నిర్మల్ మిల్కా సింగ్ (85) ఈ నెల13న  కోవిడ్  కారణంగానే కన్నుమూయడం విషాదం. మిల్కా సింగ్‌కు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అతని కుమారుడు జీవ్ మిల్కా సింగ్ కూడా ప్రఖ్యాత గోల్ఫ్ క్రీడాకారుడు.

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)