Breaking News

టైసన్‌... అదే దూకుడు

Published on Sat, 11/16/2024 - 03:54

టెక్సాస్‌: ఆరు పదుల వయసు సమీపిస్తున్నా... తనలో దుందుడుకుతనం తగ్గలేదని బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌ టైసన్‌ చాటుకున్నాడు. కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించిన ఈ ప్రపంచ మాజీ హెవీ వెయిట్‌ చాంపియన్‌... సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, యువ బాక్సర్‌ జాక్‌ పాల్‌తో బౌట్‌లో తలపడనున్నాడు. ప్రధాన పోటీకి ముందు జరిగిన ఆటగాళ్ల ప్రత్యేక కార్యక్రమంలోనే రెచ్చిపోయిన టైసన్‌... జాక్‌ పాల్‌ చెంప చెళ్లుమనిపించాడు. సుదీర్ఘ కెరీర్‌లో 50 విజయాలు సాధించిన 58 ఏళ్ల టైసన్‌... అందులో 44 బౌట్‌లను నాకౌట్‌ చేశాడు.

అసలు పోరుకు ముందు నిర్వహించిన ‘ఫేస్‌ ఆఫ్‌’ కార్యక్రమం సమయంలో నిర్వాహకులు అడుగుతున్న ప్రశ్నలకు విసుగెత్తిన టైసన్‌... ఎదురుగా ఉన్న ప్రత్యర్థి ని చెంపదెబ్బ కొట్టాడు. ఇప్పటికే ఈ బౌట్‌పై విపరీతమైన అంచనాలు పెరిగిపోగా... టైసన్‌ ప్రవర్తనతో అది మరింత ఎక్కువైంది. శనివారం జరగనున్న ఈ బౌట్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో ‘పే పర్‌ వ్యూ’ పద్ధతిలో ప్రసారం చేయనున్నారు. 

ఈ ఫైట్‌ను ప్రత్యక్షంగా 60 వేల మంది అభిమానులు... ప్రసార మాధ్యమాల ద్వారా కోట్లాది మంది వీక్షించనున్నారు. 2005లో బాక్సింగ్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన టైసన్‌... ఆ తర్వాత పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. షెడ్యూల్‌ ప్రకారం టైసన్, జాక్‌ పాల్‌ మధ్య బౌట్‌ ఈ ఏడాది జూలైలోనే జరగాల్సి ఉన్నా... ఆ సమయంలో టైసన్‌ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో దాన్ని వాయిదా వేశారు. 

దూకుడు మీదున్న టైసన్‌కు... ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌లో పది బౌట్లు నెగ్గిన  27 ఏళ్ల జాక్‌ పాల్‌ ఏమాత్రం పోటీనిస్తాడో చూడాలి. ‘చివరి బౌట్‌లో కెవిన్‌ మెక్‌బ్రైడ్‌ చేతిలో ఓడిన తర్వాత జీవితంలో చాలా చూశాను. ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నాను. కొన్నాళ్లు జైలు జీవితం కూడా గడిపాను. అన్నిటికి మించి బాక్సింగ్‌నే ఇష్టపడతా. ఒకప్పటి టైసన్‌ ఇప్పుడు లేడు. నా జీవితంలో ఎక్కువ ఏమీ మిగిలి లేదు. అందుకే మంచి అనుభూతులు సొంతం చేసుకోవాలనుకుంటున్నా’ అని ఫైట్‌కు ముందు టైసన్‌ అన్నాడు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)