Breaking News

ఆసీస్‌ దిగ్గజం కన్నుమూత

Published on Fri, 01/30/2026 - 12:52

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా మాజీ హాకీ ప్లేయర్‌ మైకేల్‌ నాబ్స్‌ కన్నుమూశారు. ఆయన గతంలో భారత పురుషుల హాకీ జట్టుకు కోచ్‌గా పనిచేశారు. నాబ్స్‌ శిక్షణలోనే భారత జట్టు లండన్‌లో జరిగిన 2012 ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించింది. 

కాగా 72 ఏళ్ల నాబ్స్‌ కొంతకాలంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన భార్య లీ కేప్స్‌ కూడా మాజీ హాకీ ప్లేయర్‌. ఆస్ట్రేలియా మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కుమార్తె కైట్లిన్‌ కూడా హాకీరూస్‌ స్టార్‌గా ఎదిగింది.

ఇక ఆటగాడిగా నాబ్స్‌ భారత్‌ ఆతిథ్యమిచ్చిన 1981 హాకీ ప్రపంచకప్, 1984లో జరిగిన లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో పోటీపడ్డారు. తదనంతరం కోచ్‌గా మారారు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌కు భారత్‌ అర్హత సాధించడంలో విఫలమైంది. దీంతో 2011లో భారత కోచ్‌గా నాబ్స్‌ నియమితులయ్యారు. 

లండన్‌ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించినప్పటికీ ఆ విశ్వక్రీడల్లో భారత్‌ అట్టడుగున నిలవడంతో ఆయనపై వేటు పడింది. నాబ్స్‌ భారత్‌తో పాటు జపాన్‌ జట్టుకు కోచ్‌గా పనిచేశారు. కాగా నాబ్స్‌ మృతి పట్ల హాకీ  ఆస్ట్రేలియా సంతాపం వ్యక్తం చేసింది. అత్యంత ప్రభావంతమైన ఒలింపియన్‌ను కోల్పోయామంటూ నివాళులు అర్పించింది.

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)