Breaking News

సన్‌రైజర్స్‌ చిత్తు.. ప్లేఆఫ్స్‌​కు చేరిన ముంబై ఇండియన్స్‌ టీమ్‌

Published on Thu, 01/30/2025 - 08:39

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2025లో ఎంఐ కేప్ టౌన్‌(MI Cape Town)​ జట్టు ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించింది. న్యూలాండ్స్‌ వేదికగా బుధవారం సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌(Sunrisers Eastern Cape)తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఎంఐ జట్టు తొలిసారి తమ ప్లేఆఫ్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.

108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఎంఐ వికెట్‌ నష్టపోకుండా కేవలం 11 ఓవర్లలోనే ఊదిపడేసింది. ముంబై జట్టు ఓపెనర్లు ర్యాన్‌ రికెల్టన్‌(59), రాస్సీ వాన్ డెర్ డస్సెన్(48) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు. స్టార్‌ ఫాస్ట్‌బౌలర్‌ మార్కో జానెసన్‌ సైతం తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేసిన జానెసన్‌ ఏకంగా 25 పరుగులు సమర్పించుకున్నాడు.

4 వికెట్లతో చెలరేగిన కార్బిన్ బాష్..
అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ ఈస్టర్న్ కేప్ 19.2 ఓవర్లలో కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్‌ బ్యాటర్లలో బెడింగ్‌హామ్(45) మినహా మిగితందరూ తీవ్ర నిరాశపరిచారు. కెప్టెన్‌ మార్‌క్రమ్‌(10), స్టబ్స్‌(5), అబెల్‌ విఫలమయ్యారు. ఎంఐ బౌలర్లలలో ఆల్‌రౌండర్‌ కార్బిన్ బాష్‌ 4 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు రబాడ రెండు, బౌల్ట్‌, రషీద్‌ ఖాన్‌, డెవాల్డ్‌ బ్రెవిస్‌ తలా వికెట్‌ సాధించారు. కాగా ఎంఐ కేప్ టౌన్‌ జట్టు ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌ యాజమాన్యానికి చెందనిదే కావడం గమనార్హం.

సన్‌రైజర్స్‌ ఫ్లే ఆఫ్స్‌ చేరుతుందా?
ఎస్‌ఎ20-2025లో పార్ల్‌ రాయల్స్‌, ఎంఐ కేప్‌ టౌన్‌లు ఇప్పటికే తమ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లను ఖారారు చేసుకోగా.. మరో రెండు స్ధానాల కోసం సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌, జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌, ప్రిటోరియా క్యాపిటల్స్‌ పోటీ పడుతున్నాయి. అయితే ప్రిటోరియా క్యాపిటల్స్‌ కంటే సన్‌రైజర్స్, సూపర్‌ కింగ్స్‌కు ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫిబ్రవరి 1న పార్ల్‌ రాయల్స్‌తో తలపడనుంది.

అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ​ఓడినా ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశముంది. ఎందుకంటే ఈస్ట్రన్‌ క్యాప్‌ ఖాతాలో 19 పాయింట్లు ఉన్నాయి. జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌(15), ప్రిటోరియా(14) పాయింట్లతో మూడు నాలుగు స్ధానాల్లో ఉన్నాయి. జోబర్గ్‌, ప్రిటోరియా జట్లకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. 

జోబర్గ్‌ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఎటువంటి సమీకరణాలు లేకుండా ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తుంది. ఒకవేళ ప్రిటోరియా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలంటే జో బర్గ్‌ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క గేమ్‌లోనైనా ఓటమి చెందాలి. ఈ సమయంలో ప్రిటోరియా మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంది.
చదవండి: జనాయ్ భోంస్లే కాదు.. సిరాజ్ డేటింగ్‌లో ఉన్నది ఆమెతోనే?

 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)