Breaking News

టీ20 మ్యాచ్‌లో విధ్వంసం.. ఏకంగా 462 పరుగులు

Published on Fri, 02/02/2024 - 08:02

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2024లో గురువారం ఏంఐ కేప్‌టౌన్‌, ప్రిటోరియా క్యాపిటల్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌కు వేదికైన సెంచూరియన్ సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో రెండు జ‌ట్లు క‌లిపి ఏకంగా 462 పరుగులు చేశాయి. ఇరు జట్ల బ్యాటర్లు ఏకంగా 32 సిక్స్‌లు బాదారు. ఆఖరికి ఈ హై స్కోరింగ్‌ మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో ఏంఐ కేప్‌టౌన్‌ విజయం సాధించింది.

రికెల్టన్ విధ్వంసం​..
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఏంఐ కేప్‌టౌన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఏంఐ బ్యాటర్లలో ఓపెనర్‌ రికెల్టన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 45 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 90 పరుగులు చేశాడు. అతడితో పాటు డెవాల్డ్‌ బ్రెవిస్‌( 32 బంతుల్లో66, 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. పొలార్డ్‌ కూడా ఆఖరిలో బ్యాట్‌కు పనిచెప్పాడు. కేవలం 7 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. ప్రిటోరియా కెప్టెన్‌ పార్నెల్‌ 3 వికెట్లు పడగొట్టాడు. 

వెర్రెయిన్నే సెంచరీ వృథా.. 
249 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా ఆఖరి వరకు పోరాడింది. లక్ష్య చేధనలో ప్రిటోరియా 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ప్రిటోరియా బ్యాటర్‌ కైల్‌ వెర్రెయిన్నే విరోచిత సెంచరీతో చెలరేగాడు. 52 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 116 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడికి  మరో ఆటగాడు సపోర్ట్‌గా నిలిచివుంటే ఫలితం మరో విధంగా ఉండేది. ఏంఐ బౌలర్లలో తుషారా 3 వికెట్లు పడగొట్టగా.. రబాడ రెండు, పొలార్డ్‌, సామ్‌ కుర్రాన్‌ తలా వికెట్‌ సాధించారు.
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)