Breaking News

బంగ్లాదేశ్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండ‌ర్‌.. అధికారిక ప్రకటన

Published on Thu, 06/12/2025 - 20:40

బంగ్లాదేశ్ క్రికెట్ జ‌ట్టు కొత్త వ‌న్డే కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండ‌ర్ మెహిదీ హసన్ మీరాజ్ ఎంపికయ్యాడు. ఈ విష‌యాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు గురువారం(జూన్ 12) విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డించింది. ఈ ఆల్ రౌండర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో స్థానాన్ని భ‌ర్తీ చేయ‌నున్నాడు. బంగ్లా వ‌న్డే కెప్టెన్‌గా మెహ‌దీ హ‌స‌న్ ఏడాది పాటు కొన‌సాగ‌నున్నాడు. 

వ‌చ్చే నెల‌లో శ్రీలంక‌తో జ‌ర‌గ‌నున్న మూడు వ‌న్డేల సిరీస్‌తో మీరాజ్ త‌న కొత్త ప్ర‌యాణాన్ని ప్రారంభించ‌నున్నాడు. మీరాజ్ గతంలో నజ్ముల్ హుస్సేన్ శాంటో డిప్యూటీగా వ్య‌వ‌హ‌రించాడు. శాంటో గైర్హ‌జ‌రీలో నాలుగు మ్యాచ్‌ల‌లో బంగ్లా జ‌ట్టును అత‌డు న‌డిపించాడు.

"బంగ్లాదేశ్ కెప్టెన్‌గా ఎంపిక‌వ్వాల‌న్న‌నా క‌ల ఈరోజు నిజ‌మైంది. నాపై న‌మ్మ‌కం ఉంచి ఈ బాధ్య‌త‌ను అప్ప‌గించిన బోర్డుకు ధ‌న్య‌వాదాలు. ఇది నాకు, నా కుటుంబానికి గర్వకారణమైన క్షణం. మా జ‌ట్టుపై నాకు పూర్తి న‌మ్మ‌కం ఉంది. జ‌ట్టును విజ‌య‌ప‌థంలో న‌డిపించ‌డ‌మే నా ల‌క్ష్య‌మ‌ని" మెహ‌దీ హ‌స‌న్ ప్రెస్‌కాన్ఫ‌రెన్స్‌లో పేర్కొన్నాడు.

మెహిదీ హసన్ ఇప్ప‌టివ‌ర‌కు 105 వ‌న్డేలు ఆడి 1617 ప‌రుగుల‌తో పాటు 110 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అత‌డు ప్ర‌స్తుతం ఐసీసీ వ‌న్డే ఆల్ రౌండ‌ర్ల ర్యాంకింగ్స్‌లో నాలుగో స్ధానంలో ఉన్నాడు. కాగా బంగ్లాదేశ్ జ‌ట్టుకు ప్ర‌స్తుతం మూడు ఫార్మాట్ల‌లో వేర్వేరు కెప్టెన్లు ఉన్నారు. టెస్ట్ జట్టుకు నజ్ముల్ హుస్సేన్ శాంటో కెప్టెన్ గా ఉండగా, టీ20ల్లో లిట్టన్ దాస్, వ‌న్డేల్లో మెహిదీ హ‌స‌న్ మీరాజ్ సార‌థిలుగా ఉన్నారు.
చదవండి: WTC Final 2025: చరిత్ర సృష్టించిన ప్యాట్ కమ్మిన్స్.. తొలి కెప్టెన్‌గా వరల్డ్‌ రికార్డు
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)