Breaking News

పోరాడి ఓడిన మేఘన రెడ్డి

Published on Thu, 09/25/2025 - 04:25

కావోసియుంగ్‌ సిటీ (చైనీస్‌ తైపీ): కావోసియుంగ్‌ మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో తెలంగాణ అమ్మాయి మారెడ్డి మేఘన రెడ్డి పోరాటం ముగిసింది. క్వాలిఫయర్‌ హోదాలో మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించిన మేఘన... బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో 21–19, 17–21, 14–21తో టాన్‌రుగ్‌ సెహెంగ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పోరాడి ఓడిపోయింది. 

64 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో మేఘన తొలి గేమ్‌ను దక్కించుకుంది. అయితే అదే జోరును తదనంతరం కొనసాగించలేకపోయింది. రెండో గేమ్‌లో ఒకదశలో 11–12తో ఒక్క పాయింట్‌ వెనుకంజలో నిలిచిన మేఘన... ఆ తర్వాత తడబడి చివరకు నాలుగు పాయింట్ల తేడాతో గేమ్‌ను కోల్పోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లో టాన్‌రుగ్‌ ఆరంభంలోనే 4–0తో ఆధిక్యంలోకి వెళ్లగా... మేఘన ఒక్కసారి కూడా స్కోరును సమం చేయలేకపోయింది. 

ఇదే టోర్నీలో బరిలోకి దిగిన భారత ఇతర క్రీడాకారిణులు దేవిక సిహాగ్‌ 26–28, 21–17, 21–13తో లీ జిన్‌ యి మేగన్‌ (సింగపూర్‌)పై, ఇషారాణి బారువా 21–13, 21–10తో నూత్నలిన్‌ రత్తానపాన్‌వోంగ్‌ (థాయ్‌లాండ్‌)పై గెలుపొంది ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకోగా... మాన్సి సింగ్, అషి్మత చాలిహా తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)