Breaking News

ఆరెంజ్‌ క్యాప్‌ గెలుచుకున్న మొదటి భారత క్రికెటర్‌ ఎవరో తెలుసా?

Published on Wed, 03/13/2024 - 11:49

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న  ఐపీఎల్ 2024 సీజ‌న్ మార్చి 22 నుంచి ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెపాక్‌ వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇక క్యాష్‌ రిచ్‌ లీగ్‌ కోసం అన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్లు ఒకొక్కరిగా జట్టుతో కలుస్తున్నారు. 17వ సీజన్ కోసం ఆటగాళ్లు తమ ప్రీ ట్రైనింగ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.

కాగా ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఆరెంజ్‌ క్యాప్‌ను బహుకరించడం అనావాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే ఈ క్యాప్‌తో పాటు  ప్రైజ్ మనీని కూడా అందజేస్తారు.  అయితే ఈ ధనాధన్‌ లీగ్‌లో ఆరెంజ్‌ క్యాప్‌ను అందుకున్న తొలి భారత క్రికెటర్‌ ఎవరో తెలుసా? మీరు ఆలోచించండి? మీకు సమాధానం తెలియకపోతే మేమే చెప్పేస్తాం.

ఆరెంజ్‌ క్యాప్‌ను గెలుచుకున్న మొట్టి మొదటి భారత ఆటగాడు ఎవరో కాదు టీమిండియా క్రికెట్‌ దిగ్గజం, ముంబై ఇండియన్స్‌ మాజీ సారథి సచిన్‌ టెండూల్కర్‌. 2010 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున సచిన్‌ ఆరెంజ్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ సీజన్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 618 పరుగులతో లీగ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

దీంతో అతడికి ఆరెంజ్‌ క్యాప్‌ దక్కింది. ఇక సచిన్‌ తర్వాత ఆరెంజ్‌ క్యాప్‌ను గెలుచుకున్న రెండో ఇండియన్‌ రాబిన్ ఉతప్ప. 2014 సీజన్‌లో కోల్‌కతాకు ప్రాతినిథ్యం వహించిన ఉతప్ప.. 660 పరుగులతో ఆరెంజ్‌క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. మరి ఈసారి ఎవరు ఆరెంజ్‌క్యాప్‌ను గెలుచుకుంటారో వేచి చూడాలి.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి