Breaking News

జాతీయ స్కూల్‌ గేమ్స్‌లో ఏపీకి పతకాలు

Published on Sun, 12/31/2023 - 04:59

సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 67వ జాతీయ స్కూల్‌ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ తన విజయ పరంపర కొనసాగిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతున్న నేషనల్‌ స్కూల్‌ గేమ్స్‌ షూటింగ్‌ పోటీల్లో బాలికల బృందం బంగారు పతకం సాధించింది. షూటర్లు తమన్యు సిరంగి (412.9), గొంటు లక్ష్మీ సమన్విత (410.4), ఆహాన రాఠీ (406.6) బృందం 1229.9 పాయింట్లు సాధించి బంగారు పతకం కైవసం చేసుకున్నారు. 

బాక్సింగ్‌లో ఆరు పతకాలు
శుక్రవారం మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన బా­లు­ర బాక్సింగ్‌ అండర్‌–14, 17, 19 విభాగాల్లో ఏపీ విద్యార్థులు ఆరు పతకాలు సాధించారు. బోండా లక్ష్మణ్‌ (ఎస్వీఎల్‌ఎన్‌ఎస్‌ విద్యాపీఠ్‌ జూనియర్‌ కాలే­జీ) రజతం, దాసరి ప్రవీణ్‌ కుమార్‌ (జీవీఎంసీ హైస్కూల్ , మాధవధార) కాంస్యం, జన్ని వసంతరా­వు (శ్రీ బాలాజీ జూనియర్‌ కళాశాల, భీమసింగి) కాంస్యం, ఆకుల అశోక్‌ కుమార్‌ (సోఫియా జూని­యర్‌ కళాశాల, జ్ఞానపురం) కాంస్యం, ఆయుష్‌ (ఎం­ఏబీ­ ­పీ జూనియర్‌ కళాశాల, గాజువాక) కాంస్యం, దొంతల దేవస్వరూప్‌ (జేఎన్‌పురం, విజయనగరం జి­ల్లా) కాంస్య పతకం సాధించారు.

ఈ సందర్భంగా విజేతలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌ కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు అభినందించినట్టు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఏపీ కార్యదర్శి భానుమూర్తిరాజు ఓ ప్రకటనలో తెలిపారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)