Breaking News

టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు ఇదే .. ఆ ముగ్గ‌రు స్టార్ క్రికెట‌ర్లకు నో ఛాన్స్‌?

Published on Thu, 04/25/2024 - 16:36

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024ల‌కు అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. జూన్‌1న అమెరికా, కెన‌డా మ‌ధ్య జ‌ర‌గ‌నున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెర‌లేవ‌నుంది. అయితే ఈ టోర్నీలో భాగ‌మయ్యే ఆయా జ‌ట్లు త‌మ వివ‌రాల‌ను మే1లోపు ఐసీసీకి స‌మ‌ర్పించాలి. ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టును మ‌రో వారం రోజుల్లో బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ ప్ర‌క‌టించ‌నుంది.

ఐపీఎల్‌లో ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగా జ‌ట్టు ఎంపికను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. ఈ సెలక్షన్ మీటింగ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గోనున్నాడు. అయితే సెలక్టర్లు కంటే ముందు చాలా మం‍ది మాజీ ఆటగాళ్లు టీ20 వరల్డ్‌కప్‌లో భాగమయ్యే భారత జట్టును అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి భారత మాజీ బ్యాటర్ అంబటి రాయుడు చేరాడు.

టీ20 ప్రపంచకప్‌కు తన 15 మంది ప్రాబబుల్స్‌ని రాయుడు ఎంచుకున్నాడు. రాయుడు ఎంచుకున్న జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు చోటు దక్కలేదు. హార్దిక్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్ జట్టులో అతడి స్ధానం ప్రశ్నార్థకంగా మారింది.

అదేవిధంగా ఐపీఎల్‌లో అదరగొడుతున్న పేస్ సంచలనం మయాంక్ యాదవ్‌.. రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్‌లకు రాయడు తన ఎంపిక చేసిన జట్టులో ఛాన్స్ ఇచ్చాడు. అయితే అనుహ్యంగా రాయుడు వికెట్ కీపర్ కోటాలో  రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, సంజూ శాంసన్‌లను కాకుండా దినేష్ కార్తీక్‌కు చోటు ఇవ్వడం గమనార్హం.

దినేష్ కార్తీక్ ఈ ఏడాది సీజన్‌లో దుమ్ములేపుతున్నాడు. ఫినిషర్‌గా వచ్చి డీకే అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే రాయుడు కార్తీక్‌కు అవకాశమిచ్చాడు. అంబటి ఎంచుకున్న జట్టులో టాప్‌-4లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి,సూర్యకుమార్‌లకు చోటు దక్కింది. ఆల్‌రౌండర్‌ కోటాలో శివమ్‌ దూబే, రవీంద్ర జడేజాలకు రాయుడు అవకాశమిచ్చాడు. ఫాస్ట్‌ బౌలర్లగా జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లకు చోటు దక్కింది. స్పెషలిస్టు స్పిన్నర్లగా కుల్దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌ను రాయుడు ఎంపిక చేశాడు.

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)