Breaking News

మాయ పోరాటం ముగిసె...

Published on Sun, 02/09/2025 - 02:44

ముంబై: భారత టీనేజ్‌ టెన్నిస్‌ స్టార్‌ మాయ రాజేశ్వరన్‌ రేవతి సంచలన ప్రదర్శన సెమీ ఫైనల్లో ముగిసింది. ముంబై ఓపెన్‌ డబ్ల్యూటీఏ–125 టోర్నీలో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీతో బరిలోకి దిగిన ఆమె అద్భుత ప్రదర్శనతో పలువురు అంతర్జాతీయ క్రీడాకారిణులను కంగుతినిపించి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. కానీ ఆమె జోరుకు సెమీస్‌లో చుక్కెదురైంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల భారత ప్లేయర్‌ 3–6, 1–6తో స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ 117వ ర్యాంకర్‌ జిల్‌ టెచ్‌మన్‌ చేతిలో పరాజయం చవిచూసింది. 

మొత్తానికి బరిలోకి దిగిన తొలి సీనియర్‌ స్థాయి టోరీ్నలో మాయ చేసిన పోరాటం అందర్ని ఆకట్టుకుంది. రెండో సెమీస్‌లో ఎనిమిదో సీడ్‌ మనంచయ సవంగ్‌కావ్‌ (థాయ్‌లాండ్‌) 6–2, 6–2తో రెండో సీడ్‌ రెబెక్కా మరినో (కెనడా)పై గెలిచి ఫైనల్‌ చేరింది. టెచ్‌మన్, రెబెక్కాల మధ్య నేడు టైటిల్‌ పోరు జరుగనుంది. డబుల్స్‌లో డచ్‌ ప్లేయర్‌ అరియనె హర్తొనొతో కలిసి బరిలోకి దిగిన భారత స్టార్‌ ప్రార్థన తోంబరే తుదిపోరుకు అర్హత సాధించింది.    

#

Tags : 1

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)